Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు

New Update
wine-shops

wine-shops

ఉత్తర్ ప్రదేశ్ లో మద్యం దుకాణాల వద్ద నిన్న భారీ క్యూలైన్లు కనిపించాయి. 2025 మార్చి 31తో ఆయా షాపుల లైసెన్స్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న స్టాకు గడువులోగా విక్రయించేందుకు వ్యాపారులు బంపరాఫర్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు మద్యం ప్రియులు కూడా బాగానే ఆసక్తి చూపించారు.  ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అంటూ ఆఫర్లు పెట్టడంతో  వైన్స్ షాపుల వద్ద భారీ స్థాయిలో గుమిగూడారు. లక్నోతో సహా అనేక నగరాల్లో మద్యం దుకాణాల వెలుపల ఆఫర్ల భారీ పోస్టర్లు వెలిశాయి.

మందుబాబులను కంట్రోల్ చేయడానికి

పొడవైన క్యూలు, రద్దీ, తోసుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.  మందుబాబులను కంట్రోల్ చేయడానికి పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గడువు ముగిశాక ప్రభుత్వం ఆ మద్యాన్ని సీజ్ చేసే అవకాశం ఉండటంతో వ్యాపారులు ఇలా చేసినట్లు సమాచారం. కాగా 2025-26 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది.  ఏప్రిల్ 1 నుండి ఇ-లాటరీ వ్యవస్థ ద్వారా కొత్త దుకాణాలు తెరవబడతాయి.  కాబట్టి మద్యం దుకాణాలు 2025 మార్చి 31 నాటికి తమ స్టాక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది.  

Also read :  PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

Advertisment
తాజా కథనాలు