/rtv/media/media_files/2025/02/07/GHdCww1Rb5O8H4sSAgLT.jpg)
Foods
ఉదయాన్నే కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం పూట తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
అధిక చక్కెర తీసుకోవడం
ఉదయాన్నే పోషకాలు ఉండే ఆహారాలు కాకుండా పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా చక్కెర ఉండే పదార్థాలను ఉదయాన్నే తీసుకుంటే రోజంతా.. అలసట, మానసిక సమస్యలు వస్తాయని అంటున్నారు. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఉదయాన్నే పోషకాలు, ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
కెఫిన్
ఉదయాన్నే కెఫిన్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనివల్ల ఒత్తిడి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ప్రాసెస్ చేసిన ఫుడ్
ఎక్కువగా నిల్వ చేసిన ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. మసాలా కారం ఉండే వాటి కంటే పండ్లు, జ్యూస్‌లు వంటి వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం
కొందరు ఉదయాన్నే తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకుంటారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఉదయం పూట ప్రొటీన్ ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, గింజలు, పెరుగు లేదా టోఫు వంటి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
food | early-morning-tips | early morning habits | healthy life style | daily-life-style | human-life-style | health-foods | latest-telugu-news | telugu-news | today-news-in-telugu