Digestion
Digestion: పెరుగు, మజ్జిగ రెండూ ప్రోబయోటిక్ పదార్థాలు. ఇవి శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని పలు జీర్ణ సమస్యలు, ఉబ్బరం, అజీర్ణం, పేగు సమస్యలు ఉన్నప్పుడు వైద్యులు సిఫార్సు చేస్తారు. అయితే ఈ రెండింటిలోని పోషకాల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయి. పెరుగు సాధారణంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాతో తయారు అవుతుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, జింక్ పుష్కలంగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
కడుపు మంటను తగ్గిస్తాయి:
పెరుగులో మంచి ప్రోటీన్, శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. మజ్జిగలో సాధారణంగా తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. మజ్జిగలో ఉన్న చురుకైన ప్రోటీన్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు మంటను తగ్గిస్తాయి. ఇది ఉబ్బరాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మజ్జిగలోని బయోయాక్టివ్ పెప్టైడ్‌లు గట్ బాక్టీరియాను నియంత్రించడంలో, ఆమ్లతను తగ్గించడంలో సహాయపడతాయి. మజ్జిగ కడుపులో వేగంగా జీర్ణం అవుతుంది.
ఇది కూడా చదవండి: గర్భిణులు పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకోకూడదా?
దీనిలోని విటమిన్లు, ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే పెరుగు కొంచెం ఘనమైన పదార్థం కావడం వలన అది కడుపులో ఎడ్జస్ట్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పెరుగు రాత్రిపూట తినడం మలబద్ధకాన్ని కలిగించవచ్చు. కాబట్టి మిగతా సమయాల్లో తీసుకోవడం మంచిది. జీర్ణక్రియకు మజ్జిగ బాగా పనిచేస్తుంది. అయితే ఎక్కువ కాల్షియం, ఇతర పోషకాల కోసం పెరుగు తీసుకోవచ్చు. సరైన సమయంలో రెండూ శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సమయం లేదని వేగంగా తింటున్నారా..ఈ సమస్యలు తప్పవు
( better-digestion | digestion-tips-telugu | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )