Paracetamol Tablets
Paracetamol Tablets: గర్భధారణ సమయంలో మహిళల శరీరం సున్నితంగా మారుతుంది. ఇది శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తీవ్ర ప్రభావాలను చూపుతుంది. ఇలాంటి సమయంలో జ్వరం, జలుబు, దగ్గు, శరీర నొప్పుల వంటి చిన్న చిన్న సమస్యలకు సాధారణంగా తీసుకునే పారాసెటమాల్ మాత్రలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. అయితే ఇటీవలి అధ్యయనాల ప్రకారం గర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ వాడకంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మందు అధికంగా లేదా నిరంతరంగా తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువుపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉంది.
జ్ఞాపకశక్తి లోపం..
ముఖ్యంగా మానసిక అభివృద్ధిలో అంతరాయాలు, మెదడు ఎదుగుదలలో ఆలస్యం వంటి ప్రమాదాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల్లో ADHD సమస్యలు ఎక్కువగా కనిపించడంలో పారాసిట్‌మాల్ ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ సమస్య వల్ల పిల్లలు ఎక్కువ కోపంగా, చిరాకుగా, ఏకాగ్రత లేకుండా ఉండే ప్రమాదం ఉంది. అదేవిధంగా మెదడు అభివృద్ధి దెబ్బతిని జ్ఞాపకశక్తి లోపం, మాట్లాడే సామర్థ్యంలో సమస్యలు, బుద్ధిమాంద్యం లక్షణాలు కూడా కనపడవచ్చు. పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకున్న గర్భిణీ స్త్రీలకు రక్తస్రావం, లివర్‌కి నష్టం వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: పీరియడ్స్ ఫ్లూ అంటే ఏంటి..దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా తక్షణమే మందులు వేసుకోవడంలో పొరపాటు చేయకూడదు. ఇంట్లో తులసి, అల్లం, మజ్జిగ వంటి సహజ చికిత్సలను మొదట ప్రయత్నించాలి. అలాగని అన్ని సమస్యలకు ఇంటి చిట్కాలతోనే సరిపోతుందని కాదు. తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఆరోగ్యంగా మాతృత్వాన్ని కొనసాగించాలంటే జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి
( paracetamol-side-effects | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)