food Eating fast
Health Tips: చెడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఎంత తినామన్నదానికంటే ఎలా తిన్నామన్నదే ముఖ్యం. నేటి జీవనశైలిలో చాలామంది వారి అల్పాహారం లేదా భోజనాన్ని పదిహేను నిమిషాల్లో ముగించేస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం భోజనానికి కనీసం 20-30 నిమిషాలు కేటాయించాలి. ముఖ్యంగా తినేటప్పుడు ప్రతి ముద్దను బాగా నమలడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మన లాలాజలంలో ఉండే టైలెనాల్, లైసోజైమ్ వంటి ఎంజైములు ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేసి పొట్టలోకి పంపే విధంగా సహాయపడతాయి.
శరీరం అవసరమైన పోషకాలను..
త్వరగా తినడం వల్ల భోజనం పూర్తయిన అనుభూతి మెదడుకు ఆలస్యంగా చేరుతుంది. ఫలితంగా అధికంగా తినే ప్రమాదం పెరిగి ఊబకాయం వస్తుంది. అలాగే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. తినే సమయంలో ఆహారాన్ని సరిగా నమలకపోతే శరీరం అవసరమైన పోషకాలను సరిగ్గా గ్రహించలేదు. వేగంగా తినే అలవాటు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయడం ద్వారా మధుమేహానికి దారితీస్తుంది. ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీర్ఘకాలికంగా ఈ పరిస్థితులు అధిక రక్తపోటు, గుండె జబ్బులకు దారితీయవచ్చు.
ఇది కూడా చదవండి: ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే ఇలా చేయండి
నెమ్మదిగా తినడం, దాని రుచి ఆస్వాదించడమే మంచి పరిష్కారం. ప్రతి ముద్దను కనీసం 20-25 సార్లు నమలడం వల్ల ఆహారం సరిగా జీర్ణమవుతుంది. ఈ అలవాటు శరీరానికి తక్కువగా తిన్నా తృప్తిగా ఉన్న భావనను కలిగిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. తినే సమయంలో ఇతర పనులపై దృష్టి పెట్టకుండా మనసు మొత్తం ఆహారంపైనే పెట్టాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తిరుపతిలో విషాదం.. దామల చెరువులో వ్యాపారి దారుణ హత్య
( health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)