Diet Tips: డయాబెటిస్ ఉంటే ఆలు గడ్డ తినొచ్చా..? వైద్యుల సూచనలు తెలుసుకోండి..!!

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్‌ వంటివి తినాలి.

New Update
diabetics and potatoes

diabetics and potatoes

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. మన రోజువారీ ఆహారంలో బంగాళాదుంపలు ఒక ముఖ్యమైన భాగం. కానీ డయాబెటిస్ రోగులు బంగాళాదుంపలు తినడం సురక్షితమేనా..? వైద్యులు ఈ విషయం గురించి ఏమి చెబుతున్నారు..? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ రోగులు బంగాళాదుంపలకు దూరంగా ఉండాలంటున్నారు. బంగాళాదుంపలకు బదులుగా ఆకుపచ్చని ఆకుకూరలు తినాలని వారు సూచిస్తున్నారు. అప్పుడప్పుడు బంగాళాదుంపలు తీసుకోవడం పెద్దగా ప్రమాదకరం కానప్పటికీ.. వాటిని రోజూ తినడం మాత్రం పూర్తిగా మానుకోవాలని చెబుతున్నారు.

బంగాళాదుంపలు- డయాబెటిస్ మధ్య సంబంధం:

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది డయాబెటిస్ రోగులకు ప్రమాదకరం. అంతేకాకుండా బంగాళాదుంపలకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే అవి త్వరగా గ్లూకోజ్‌గా మారిపోతాయి. నిరంతరం బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ రోగులకు కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్‌లో తక్కువ కార్బ్, ఫైబర్ అధికంగా ఉంటాయి, టొమాటోలు, దోసకాయ సలాడ్‌ వంటివి చేసుకుని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆత్మహత్య గురించి ఆలోచనలా..? ఈ విషయాలు తెలుసుకుంటే ఇంకెప్పుడు అలా ఆలోచించరు

బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతోపాటు శరీర బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. డయాబెటిస్‌తోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బంగాళాదుంపల వినియోగాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళాదుంపలకు బదులుగా పాలకూర, మెంతి, క్యాబేజీ, కాకరకాయ వంటి కూరగాయలు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బంగాళాదుంపలు మానేయడంతోపాటు.. రోజూ వ్యాయామం చేయడం, స్వీట్లు, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇది సమగ్రమైన ఆరోగ్యానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శారీరక కలయిక తరువాత అక్కడ నొప్పి రావడానికి విటమిన్ లోపం కారణమని తెలుసా..?

Advertisment
తాజా కథనాలు