/rtv/media/media_files/2025/03/07/iK9Me6Zp9SsnIEfZDRLY.jpg)
Tongue Photograph: (Tongue )
తినే ఆహారం రుచిగా ఉందా లేదా అనేది నాలుక చెబుతుంది. జ్వరం వచ్చినందని డాక్టర్ దగ్గరకు వెళ్తే.. తప్పకుండా నాలుక చూస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూ్ల్ వల్ల చాలా మంది నోటిని అసలు శుభ్రం చేరుకోరు. దీనివల్ల నోటిలో బ్యా్క్టీరియా ఉండిపోతుంది. చాలా మంది బద్దకం వల్ల కొన్నిసార్లు బ్రష్ కూడా చేయరు. అసలు నాలుకను శభ్రం చేసుకోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు (Health Problems) వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
నోటిపూత చిగుళ్ల వ్యాధి..
నోరు ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. నాలుక (Toungue) ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే దంతక్షయం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చిగుళ్ల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఎందుకంటే నాలుకను శుభ్రం చేయకపోతే విషపదార్ధాలు పేరుకుపోతాయి. దీంంతో దుర్వాసన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
వైద్యులు నాలుకను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తారు. నాలుకను శుభ్రం చేసుకోకపోతే కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరి నాలుకపై తెల్లటి బొబ్బలు వస్తాయి. అలాగే రక్తహీనత, విటమిన్ల లోపం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి నాలుకను డైలీ తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.