/rtv/media/media_files/2025/03/07/GsCnXbEVsGN7AnneXZ4Q.jpg)
SVSC RE release
SVSC Re Release: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు విడుదలైన తమ హీరోల సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి సినిమాలో సినిమాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. దాదాపు 12 ఏళ్ళ ఈ హిట్ మూవీ మరోసారి బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చింది. ఈరోజు ఎంపిక చేసిన పలు థియేటర్లలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీ రిలీజయింది. విడుదలై 12 ఏళ్ళు దాటినా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Pulla Kundi Scenes Recreate chesaru ga Raa 😂😂🤣#SVSCReRelease#SVSC4K#MaheshBabupic.twitter.com/KvbEGMBzU6
— SAI DHFM 🌶️ 🔥 (@MbGodavari) March 7, 2025
సీన్ రిక్రియెట్
ఏకంగా థియేటర్లలోనే సినిమాలోని సీన్లను రీక్రియెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఓ థియేటర్లో పెళ్లిలోని పూలకుండీ సీన్ ని రీక్రియెట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్ని సినిమాలు వచ్చిన.. SVSC వైబే వేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో థియేటర్లో వెంకటేష్- అంజలి పెళ్లి సీన్ రీక్రియెట్ చేశారు.
#SVSC Pelli Scene recreated in Vijayawada Sailaja Theatre 🥳😂🥳@urstrulyMahesh#SVSC4K#SVSCReRelease@SSMBSpace@AlankarMBFans@MaheshFanTrendspic.twitter.com/qTzwdkBzuR
— urstruly fazal (@FazalRoczz) March 7, 2025
2013లో విడుదలైన ఈ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది. పెద్దోడు, చిన్నోడు పాత్రల్లో వెంకటేష్, మహేష్ బాబు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నటించారు. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తోనే ఉంటాయి.