/rtv/media/media_files/2025/03/07/6w1yjYxJByzWlairZ8sv.jpg)
14 Year Old Girl Forced Into Child Marriage In Tamil Nadu
ఓవైపు బాల్య వివాహలను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారు. అయినా ఎవ్వరిలోనూ మార్పు రావడం లేదు. అదే పనిగా కొందరు బాల్య వివాహాలు చేసుకుంటూ చిన్నారుల జీవితాన్ని చిదిమేస్తున్నారు.
14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం
తాజాగా అలాంటిదే 14 ఏళ్ల చిన్నారిని 29 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆ చిన్నారిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లాడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ చిన్నారి అతడితో వెళ్లను వెళ్లను అంటూ కన్నీరు పెట్టుకుంది. అయినప్పటికీ పెళ్లి కొడుకు ఆ చిన్నారిని కనికరించలేదు. తన భుజాలపై మోసుకుంటూ బలవంతా ఎత్తుకొని తీసుకెళ్లాడు.
తమిళనాడులో బాల్యవివాహాం
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025
కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు
తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు
అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా,… pic.twitter.com/RDVdc0uLFu
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నార్రా బాబు అంటూ ఒక నెటిజన్ మండి పడ్డారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే..
Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!
కన్నీరు పెట్టిస్తున్న ఈ చిన్నారి పెళ్లి కూతురి సంఘటన తమిళనాడులో జరిగింది. కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు.. బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా పెళ్లి కొడుకు తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి భర్తను, భర్త తమ్ముడిని బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు.