Milkshake Side Effects: మిల్క్ షేక్‌తో మైండ్‌ షేక్ అయిపోతుంది జాగ్రత్త!!

అధికంగా మిల్క్ షేక్‌లను తాగడం వల్ల మెదడుకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. మిల్క్ షేక్‌లలో ఉండే అధిక చక్కెర, కొవ్వు మెదడు కణాలను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. అధిక చక్కెరను తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్‌లపై ఒత్తిడి పెరిగి మెదడు కణాలను దెబ్బతీస్తాయి.

New Update
Milkshake Side Effects

Milkshake Side Effects

మిల్క్‌షేక్(Milkshake) అనేది పాలు, ఐస్ క్రీం(Ice Cream), ఫ్లేవరింగ్ సిరప్‌లు లేదా పండ్లతో కలిపి తయారుచేసే ఒక చల్లని రుచికరమైన పానీయం. ఇది క్రీమీగా, చిక్కగా వివిధ ఫ్లేవర్లలో లభిస్తుంది. వాటిలో చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెరీ ఫ్లేవర్స్ చాలా ప్రసిద్ధి చెందాయి. పైభాగాన విప్డ్ క్రీం, చెర్రీ, చాక్లెట్ చిప్స్‌తో అలంకరిస్తారు. ఇది ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా ఉంటుందని పెద్దలు, పిల్లలు ఇష్టపడతారు. పార్టీలలో, వేడుకలలో దీనిని స్పెషల్ డ్రింక్‌గా కూడా అందిస్తారు. మిల్క్‌షేక్ ఎల్లప్పుడూ సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ పానీయం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

మెదడుపై తీవ్ర ప్రభావం:

అప్పుడప్పుడు స్నాక్స్‌గా తీసుకునే మిల్క్ షేక్‌ను ఆరోగ్యకరమైన పానీయంగా చాలా మంది భావిస్తారు.  కానీ ఇటీవల ఓ అధ్యయనం దీని గురించి ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది. అధికంగా మిల్క్ షేక్‌లను తాగడం వల్ల మెదడుకు తీవ్రమైన నష్టం జరగవచ్చని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. మిల్క్ షేక్‌లలో ఉండే అధిక చక్కెర, కొవ్వు మెదడు కణాలను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. మిల్క్ షేక్ రుచికరంగా, శక్తివంతంగా కనిపించినప్పటికీ ఇందులో అధిక చక్కెర, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, అధిక కేలరీలు ఉంటాయి. దీనిని తరచుగా తాగినప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. నిరంతరం అధిక చక్కెరను తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్‌లపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు నెమ్మదిగా ప్రభావితమవుతుంది. అందుకే పరిశోధకులు దీనిని మెదడు ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు. అధికంగా మిల్క్ షేక్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తగ్గుతాయి. దీనిని బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్ అని అంటారు. ఈ హెచ్చుతగ్గులు మెదడు కణాలను దెబ్బతీస్తాయి.

ఇది కూడా చదవండి: బ్లాక్‌రైస్, బ్రౌన్‌రైస్ మధ్య తేడా ఏంటి..? ఇందులో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?

అధిక చక్కెర ఆహారం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, న్యూరోలాజికల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అధిక చక్కెర, కొవ్వు ఉండే ఆహారం మెదడులోని హిప్పోక్యాంపస్ భాగాన్ని బలహీనపరుస్తుందని కనుగొన్నారు. ఈ భాగం జ్ఞాపకశక్తిని నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా మిల్క్ షేక్‌లు, చక్కెర పానీయాలు తాగేవారిలో వయసు కంటే ముందే మెదడు కణాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజా పండ్లను పాలు, పెరుగు, తేనె, బెల్లం కలిపి చక్కెర లేకుండా స్మూతీ తయారు చేసుకుని తినాలి.  పిల్లలకు చక్కెర షేక్‌లు ఇవ్వడానికి బదులుగా తాజా పండ్లు తినే అలవాటును పెంచాలి. మిల్క్ షేక్ రుచిని, చల్లదనాన్ని ఇస్తుందని ఎక్కువగా తీసుకుంటే మెదడు కణాలకు తీవ్రమైన నష్టం జరగవచ్చు. మీరు మీ మెదడును ఎక్కువ కాలం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. మిల్క్ షేక్‌లకు బదులుగా సహజమైన, ఆరోగ్యకరమైనవి ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:కారుప్రయాణాల్లో వాంతులు ఎందుకొస్తాయో తెలుసా..? ఈ సింపుల్ నివారణాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు