/rtv/media/media_files/2025/09/10/car-journey-vomiting-2025-09-10-14-09-56.jpg)
car journey vomiting
కారులో ప్రయాణం అంటే కేవలం ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళడం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి. కిటికీలో నుంచి వీచే చల్లటి గాలి, రోడ్డుపై సాగే ప్రయాణం, పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, కొత్త ప్రదేశాల అన్వేషణ, ఇవన్నీ మన మనసుకి ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. ఒంటరిగా అయినా, స్నేహితులతో లేదా కుటుంబంతో కలిసి అయినా, ప్రతి కారు ప్రయాణం ఒక కొత్త జ్ఞాపకాన్నిస్తుంది. మధురమైన పాటలు వింటూ.. ఇష్టమైన వారితో కబుర్లు చెప్పుకుంటూ చేసే ఈ ప్రయాణం ఒక మరపురాని అనుభవంగా ఉంటుంది. ఇంత ఆనంద సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు వాంతులు చేసుకుంటారు. ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనిని నివారించడానికి ఖచ్చితమైన మార్గాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
నరాల వ్యవస్థపై పడి..
కారు బస్సు, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యను సాధారణంగా మోషన్ సిక్‌నెస్ అని పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ప్రయాణం చాలా అసౌకర్యంగా మారుతుంది. అయితే ఈ సమస్యపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణంలో అంతర్గత చెవి కళ్లు మెదడుకు పంపే సమాచారంలో వైరుధ్యం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. కారు సీటులో కూర్చుని ఉన్నప్పుడు కళ్లు శరీరం స్థిరంగా ఉన్నట్లు చూస్తాయి. కానీ కారు కదలికల వల్ల చెవి, మెదడు శరీరం కదులుతున్నట్లు గుర్తిస్తాయి. ఈ వైరుధ్యం కారణంగా మెదడు అయోమయానికి గురవుతుంది. దీని ప్రభావం నరాల వ్యవస్థపై పడి వికారం, తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలు మొదలవుతాయి. ఈ సమస్య ఎక్కువగా పిల్లలు, మహిళలతోపాటు మైగ్రేన్, ఎక్కువ దూరం ప్రయాణించేవారు, బలహీనమైన బ్యాలెన్స్ సిస్టమ్ ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: మీ పిల్లల గొంతులో ఏమైనా ఇరుక్కుంటే.. ఈ 3 టిప్స్ పాటిస్తే సేఫ్!
నిపుణుల నివేదిక ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరు మోషన్ సిక్‌నెస్‌కు గురవుతారు. అంటే 10 మంది ప్రయాణిస్తే అందులో ముగ్గురికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మొబైల్ లేదా పుస్తకాలు చదువుతూ ప్రయాణించేవారిలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అదే సమయంలో.. కిటికీలోంచి బయటకు చూసేవారిలో మోషన్ సిక్‌నెస్ వచ్చే అవకాశం 40 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ప్రయాణంలో కిటికీలోంచి బయట దృశ్యాలను చూడటం వల్ల కళ్లు, చెవికి ఒకే రకమైన సమాచారం అందుతుంది, ప్రయాణంలో మొబైల్, పుస్తకాలకు దూరంగా ఉండాలి. వీటిని ఉపయోగించడం వాంతులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది, ప్రయాణానికి ముందు తేలికపాటి, నూనె పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అల్లం వాంతులు, వికారాన్ని తగ్గిస్తాయి. లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మెదడు, నరాల వ్యవస్థ శాంతించి వాంతుల సమస్య తగ్గుతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది సాధారణ సమస్య. కానీ ఇది తరచుగా వస్తూ ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు ఇది అంతర్గత చెవి ఇన్ఫెక్షన్, ఇతర వైద్య సమస్యల వల్ల కూడా కావచ్చు. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో జాగ్రత్త..ఈ లక్షణాలు ఉంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లే..!!