/rtv/media/media_files/2025/09/10/brown-rice-vs-black-rice-2025-09-10-18-05-31.jpg)
Brown Rice Vs Black Rice
అన్నం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆహారం. ఇది కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు.. మన జీవితాల్లో భాగం. తరతరాలుగా అన్నం ప్రేమ, ఆప్యాయత, సంప్రదాయాలకు చిహ్నంగా మంచి పేరు ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రధాన ఆహారంగా ఉన్నప్పటికీ.. భారతదేశంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన సాంప్రదాయ వంటకాల్లో.. పండగలలో, వేడుకలలో అన్నం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం శరీరానికి బలాన్ని ఇచ్చేదే కాదు.. సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అయితే ఆరోగ్యానికి బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్‌లో ఏది మంచిదని చాలామందికి డౌట్ ఉంటుంది. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అతిగా తినకుండా...
అన్నం లేనిదే మన భోజనం అసంపూర్ణం. సాధారణంగా మనం తెల్ల బియ్యం తింటాం. కానీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండూ తెల్ల బియ్యం కంటే పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారికి, జీర్ణక్రియ మెరుగుపరచుకోవాలనుకునేవారికి, లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునేవారికి బ్రౌన్ రైస్ మంచి ఎంపిక. ఇందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంచి.. అతిగా తినకుండా ఆపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సైలెంట్ హార్ట్ ఎటాక్‌తో జాగ్రత్త..ఈ లక్షణాలు ఉంటే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లే..!!
మరోవైపు బ్లాక్ రైస్ దీనిని ఫర్బిడెన్ రైస్ అని కూడా పిలుస్తారు. దాని ముదురు నలుపు లేదా ఊదా రంగుకు కారణమైన ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్రౌన్ రైస్ ఫైబర్‌కు, జీర్ణక్రియకు ప్రాముఖ్యత ఇస్తుంది. అయితే బ్లాక్ రైస్ యాంటీ ఆక్సిడెంట్లకు, గుండె, కంటి ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఏ బియ్యాన్ని ఎంచుకున్నా.. తెల్ల బియ్యం కంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఉప్పు, చెక్కర, నూనె.. ఈ మూడింటిని ప్రతీ రోజు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసా..?