/rtv/media/media_files/2025/11/19/white-eggs-2025-11-19-17-11-34.jpg)
White Eggs
గుడ్లను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు చాలా మందికి వచ్చే సాధారణ సందేహం ఏమిటంటే.. బ్రౌన్ గుడ్లు మంచివా లేక వైట్ గుడ్లు మంచివా..? బ్రౌన్ గుడ్లకు ధర కొంచెం ఎక్కువగా ఉండటం వలన అవి ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డు రంగు దాని పోషక విలువను (Nutritional Value) నిర్ణయించదు. అది బ్రౌన్ గుడ్డు అయినా లేదా వైట్ గుడ్డు అయినా పోషకాహార విలువలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే వాటి గురించి కొన్ని విషయాలను ఈ అర్టికల్‌లో తెలుసుకుందాం.
బ్రౌన్ గుడ్లు Vs వైట్ గుడ్లు..
తెల్ల, బ్రౌన్ గుడ్లు రెండింటిలోనూ దాదాపు 6.3–6.5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే రెండింటిలోనూ విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి బ్రౌన్ గుడ్లు ఆరోగ్యకరమైనవని చెప్పడం తప్పు. ఈ రెండు గుడ్ల మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే.. తెల్లటి ఈకలు ఉన్న కోళ్లు తెల్ల గుడ్లను ఉత్పత్తి చేస్తాయి.. అదేవిధంగా గోధుమ రంగు ఈకలు ఉన్న కోళ్లు బ్రౌన్ గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం జాతిలో తేడా మాత్రమే.. ఆరోగ్యానికి సంబంధించిన తేడా కాదు. బ్రౌన్ గుడ్లు పెట్టే కోళ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయని కాబట్టి వాటికి ఎక్కువ ఆహారం అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జనపనార గింజల్లో ఎన్నో పోషకాలు.. పోషకాహార నిపుణుల సలహా మీరూ తెలుసుకోండి
వాటి సంరక్షణ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే బ్రౌన్ గుడ్లకు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికి పోషకాహారంతో ఎటువంటి సంబంధం లేదు. గుడ్డు రుచి అనేది కోడి ఏమి తింటుంది, ఆ గుడ్డు ఎంత తాజాగా ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ దేశీ గుడ్లను ఎంచుకోవచ్చు. ఫ్రీ-రేంజ్ కోళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ.. ఆకుకూరలు, కీటకాలు, ధాన్యాలు వంటి సహజమైన ఆహారాలను తింటాయి. అందుకే దేశీ గుడ్లలో సుమారు 7–7.5 గ్రాముల ప్రొటీన్‌తోపాటు విటమిన్ ఎ, ఇ, ఒమేగా-3 స్థాయిలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. వాటి పచ్చసొన (Yolk) కూడా ముదురు రంగులో ఉండి.. మంచి రుచిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇకపై గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు బ్రౌన్, వైట్ గురించి ఆలోచించకుండా.. వాటి తాజాదనం, మూలాన్ని (Source) పరిగణనలోకి తీసుకోవాలి. సరైన మూలం నుంచి వచ్చిన తాజా గుడ్లు అత్యంత ప్రయోజనకరమైనవని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఒమేగా ఆయిల్స్ ఉండే ఈ గింజలు ఎప్పుడు తినాలో ఇప్పుడే తెలుసుకోండి!!
Follow Us