/rtv/media/media_files/2025/11/18/hemp-seeds-2025-11-18-15-19-31.jpg)
hemp seeds
నేటి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన కారణంగా ప్రజలు తమ ఆహారంలో అనేక రకాల ఆరోగ్యకరమైన విత్తనాలను చేరుస్తున్నారు. చియా, పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజల గురించి వినే ఉంటారు. అయితే జనపనార గింజల(Hemp Seeds) గురించి చాలా మందికి తెలియదు. ఇతర గింజల మాదిరిగానే హెంప్ సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ కొద్ది మొత్తంలో హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. - health tips in telugu
జనపనార గింజలతో అద్భుత ప్రయోజనాలు:
హెంప్ సీడ్స్‌లో సహజంగా ఒమేగా-3, ఒమేగా-6, GLA (గామా-లినోలెనిక్ ఆమ్లం) ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులుగా చెబురుతారు. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఈ కొవ్వు ఆమ్లాల సమతుల్య నిష్పత్తి శరీరంలో కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది.. తద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. హెంప్ సీడ్స్‌లో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉండే సంపూర్ణ ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులు తమ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి ఇవి గొప్ప ఎంపిక. ఇవి జుట్టు, చర్మం ఆరోగ్యానికి, కండరాల రికవరీకి చాలా మేలు చేస్తాయి, సులభంగా జీర్ణం అవుతాయి. ఈ విత్తనాలలో మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శక్తిని పెంచడంలో, హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలో, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చదవండి: పొద్దున్నే చురుకుగా ఉరకలెత్తే శక్తి కావాలా..? అయితే ఈ ఐదు ఆహార పదార్థాలు తిని చూడండి!!
ఆహారంలో ఖనిజాలు తక్కువగా ఉంటే.. రోజుకు 1-2 టీస్పూన్ల హెంప్ సీడ్స్ సహాయపడతాయి. హెంప్ సీడ్స్‌లోని కొవ్వు ఆమ్లాలు చర్మం తేమను నిలుపుకోవడానికి, చర్మ అవరోధాన్ని (స్కిన్ బారియర్) బలోపేతం చేయడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతమై, పొడిబారడం తగ్గి, జుట్టు బలం పెరుగుతుంది. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఉబ్బరం (Bloating), మలబద్ధకం, తక్కువ శక్తి, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిరోజూ 1–2 టీస్పూన్ల హెంప్ సీడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండి, శరీరం శక్తివంతంగా ఉంటుంది. నిపుణులు ఈ గింజలతో చేసిన చట్నీని తినమని సిఫార్సు చేశారు. ఇందుకోసం 2 టీస్పూన్ల హెంప్ సీడ్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు, 1-2 పచ్చి మిర్చి, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1-2 ఎండు మిర్చి, రుచికి ఉప్పు, అర నిమ్మకాయ రసం కలిపి రుబ్బుకోవాలి. దీనివల్ల రుచిగా ఉండటంతోపాటు పోషకాలు శరీరానికి అందుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం... హెంప్ సీడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుందా..! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!!
Follow Us