/rtv/media/media_files/2025/10/23/disturbed-sleep-at-night-2025-10-23-09-11-03.jpg)
Disturbed Sleep Night
ప్రతి ఒక్కరికీ రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. అప్పుడప్పుడు రాత్రి మధ్యలో నిద్ర లేవడం సాధారణమే అయినా.. తరచుగా ఇలా జరిగితే అది ఆరోగ్యకరం కాదు. టాయిలెట్‌కు వెళ్లాలనే కోరిక, దాహం, పీడకల లేదా సరిగా లేని పడుకునే భంగిమ వంటివి దీనికి కారణం కావచ్చు. అయితే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య లేవడం, తిరిగి నిద్ర పట్టకపోవడం వెనుక అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. రాత్రి మధ్యలో నిద్ర లేస్తున్నారా..? కారణాలు, పరిష్కారాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాత్రి నిద్రకు అంతరాయం కలిగించే కారణాలు:
వయస్సు పెరగడం: వయస్సు పెరిగే కొద్దీ నిద్ర చక్రాలు మారుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది రాత్రిపూట మేల్కోవడానికి దారితీస్తుంది.
ఒత్తిడి (Stress): ఒత్తిడి శరీరంలోని కొన్ని నాడీ వ్యవస్థలను సక్రియం చేసి.. రాత్రి మధ్యలో మేల్కొనేలా చేస్తుంది. ఇది రక్తపోటు మార్పులకు, గుండె వేగానికి దారితీస్తుంది.
మందుల దుష్ప్రభావాలు (Side Effects): దీర్ఘకాలికంగా తీసుకునే కొన్ని మందులు నిద్రను ప్రభావితం చేస్తాయి. డీకాంగెస్టెంట్లు (decongestants), యాంటిడిప్రెసెంట్స్ (antidepressants) వంటివి కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: ఈ 3 పానియాలు తాగితే షుగర్ వ్యాధి పరార్.. అవేంటో తెలుసా?
కాలేయ సమస్యలు (Liver Problems): రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య మేల్కొంటే.. కాలేయం సరిగా పనిచేయకపోవడం ఒక కారణం కావచ్చు. కాలేయ లోపం రక్త ప్రసరణను ప్రభావితం చేసి.. నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి కూడా కాలేయ పనితీరును తగ్గిస్తుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు: గ్యాస్ట్రిక్ ఆర్థరైటిస్, డిప్రెషన్, మెనోపాజ్, స్లీప్ అప్నియా వంటి ఇతర అనారోగ్యాలు కూడా రాత్రిపూట నిద్ర లేవడానికి కారణమవుతాయి.
రాత్రి లేచినట్లయితే.. భయపడకుండా శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. గడియారాన్ని పదే పదే చూస్తూ ఆందోళన పడటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సమయాల్లో దీర్ఘ శ్వాసలు తీసుకోండి, మెడిటేషన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. 20 నిమిషాల వరకు నిద్రపోలేకపోతే.. మంచం దిగి పుస్తకం చదవడం, తేలికపాటి సంగీతం వినడం వంటి పని చేయాలి. ఈ సమయంలో మొబైల్, టీవీ లేదా ల్యాప్‌టాప్‌ను వాడటం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే అవి నిద్రకు పూర్తిగా భంగం కలిగిస్తాయి. పడకగది శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నల్లటి జిడ్డు పట్టేసిందా పెనానికి.. ఏం ఫర్వాలేదు దాన్ని వదిలించే ఫార్ములా ఇదిగో