/rtv/media/media_files/2025/05/02/bCIUwBVRSkFRSVc10ha1.jpg)
Fennel
Fennel: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం వేడెక్కిపోవడం, డీహైడ్రేషన్, అలసట, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు చాలా సాధారణంగా ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో శరీరాన్ని సహజంగా చల్ల బరచే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటి సహజ ఔషధ గుణాలు కలిగిన పదార్థాల్లో సోంపు ఒకటి. సోంపు గింజలు భారతీయ వంటకాలలో సాధారణంగా ఉపయోగించే మసాలా, కానీ ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సమ్మరీలో సోంపు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చర్మాన్ని మెరిసేలా..
వేడిగా ఉన్నప్పుడు సోంపు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా బలపరిచే శక్తి కలిగి ఉంటుంది. సోంపులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించి శక్తివంతమైన జీర్ణవ్యవస్థను అందిస్తాయి. సోంపు తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. వేసవిలో శరీరాన్ని వేడి నుండి కాపాడటానికి ఇది సహాయపడుతుంది. అలాగే సోంపులోని పౌష్టిక విలువలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సోంపు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వీటితో పాటు రోజువారీ జీవనశైలిలో సోంపును చేర్చడం ద్వారా వేడి వల్ల కలిగే ప్రతికూలతలను తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?
సోంపును వాడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. సోంపును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే సోంపుతో కూడిన సిరప్‌ను తయారుచేసుకోవచ్చు. దీనికి సోంపు నీటిని వడకట్టి అందులో చక్కెర, నిమ్మరసం కలిపి తాగితే శరీరం చల్లగా ఉంటుంది. సోంపు, పుదీనా టీని తయారు చేసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి తేమ అందడంతోపాటు చల్లగా ఉంటుంది. చివరిగా సలాడ్‌లలో సోంపు గింజలు చేర్చడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విధంగా వేసవిలో సోంపును పలు మార్గాల్లో వినియోగించుకోవడం వల్ల వేడి ప్రభావాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.'
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో ఈ రంగు బట్టలు వేసుకుంటే కూల్‌గా ఉంటుంది
( fennel | fennel-benefits | fennel-seeds | fennel-seed-water | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)