/rtv/media/media_files/2025/05/01/watermelons3-470712.jpeg)
వేసవిలో పుచ్చకాయ ఒక రుచికరమైన, రిఫ్రెషింగ్ పండు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. పుచ్చకాయ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. కొన్ని ఆనారోగ్య సమస్యలలో పుచ్చకాయ తినడం హానికరం. ఆ వ్యక్తులు ఎవరో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/05/01/watermelons4-716017.jpeg)
వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ పుచ్చకాలను తింటుంటారు. రుచితో పాటు శరీరంలో నీటి శాతాన్ని పెంచడంలో పుచ్చకాయలు సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/05/01/watermelons5-887090.jpeg)
పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడంతో పాటు డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. కానీ పుచ్చకాయ కూడా అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినడం హానికరం.
/rtv/media/media_files/2025/05/01/watermelons2-631515.jpeg)
పుచ్చకాయలో ఎక్కువగా సహజ చక్కెర ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే షుగర్ ఉన్నవారు పుచ్చకాయలు తక్కువగా తినాలి.
/rtv/media/media_files/2025/05/01/watermelons7-671022.jpeg)
పుచ్చకాయ తింటే జలుబు చేస్తుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉంటే లేదా తరచుగా గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరం సమస్యలు ఉంటే పుచ్చకాయ తినకూడదు.
/rtv/media/media_files/2025/05/01/watermelons8-473048.jpeg)
పుచ్చకాయ చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇది శ్లేష్మం స్రావాన్ని పెంచుతుంది. ఉబ్బసం లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి పుచ్చకాయ తినడం హానికరం. అందుకే దీనికి దూరంగా ఉండాలి.
/rtv/media/media_files/2025/04/30/watermelon4-319979.jpeg)
జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటే పుచ్చకాయ తినకూడదు. రాత్రి సమయంలో, ఉదయం ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినకపోవడమే బెటర్ అని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/03/08/8cGYZzL5Nab24LuQuDxx.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.