heart attack and banana
Banana: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం, సమతుల్య పోషణ అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధనలో రోజు మూడు అరటి పండ్లను తీసుకోవడం వల్ల గుండెపోటును నివారించవచ్చని తేలింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో ఒక్కో అరటిపండు తినడం ద్వారా శరీరంలో పొటాషియం స్థాయిలు సమతుల్యంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. పొటాషియం రక్తనాళాలను సడలించడంతో పాటు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దాంతో గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. అంతేకాదు మెదడు సంబంధిత రుగ్మతలను కూడా 21 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనల్లో తేలింది.
శరీరానికి నష్టాన్ని కలిగించే..
అరటి పండ్లు తీసుకోవడం వల్ల శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో సహజంగా ఉండే చక్కెర, ఫైబర్, విటమిన్ బి6, మెగ్నీషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో కొలెస్ట్రాల్ లేకపోవడం గుండెజబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. కేవలం అరటిపండ్లే కాదు, నట్స్, చేపలు, పాలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను కూడా రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే పొటాషియం కూడా అధికమైపోతే శరీరానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: చికెన్ తింటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా..నిపుణులు ఏమంటున్నారు?
ముఖ్యంగా కిడ్నీ ఫంక్షన్ బలహీనంగా ఉన్నవారు అధిక పొటాషియం తీసుకుంటే ప్రమాదం కలగవచ్చు. కాబట్టి ఒక పరిమితిలోనే పొటాషియం ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రోజుకు సాధారణంగా 3,500 మిల్లీగ్రాముల పొటాషియం సరిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అరటి పండ్లను వాడితే గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. దీనికి తోడు వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హైబీపీ ఉన్నవారు కోడిగుడ్లు తింటే ఏమవుతుంది?
( heart-attack | banana-health-benefits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)