High BP
High BP: నేటి కాలంలో హైబీపీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ఆనారోగ్య సమస్య. దీన్ని నియంత్రించడానికి మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చాలా అవసరం. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైబీపీ ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా ఒక గుడ్డు సుమారుగా 213 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు 300 మిల్లీగ్రాముల వరకూ కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు.
కొలెస్ట్రాల్ శాతం తగ్గించుకోవచ్చు:
అయితే హైబీపీ ఉన్నవారికి ఇది 200 మిల్లీగ్రాములకు మించకూడదు. దీని ప్రకారం చూస్తే ఒక గుడ్డుతోనే రోజువారీ పరిమితిని అధిగమించే అవకాశం ఉంది. బీపీ పూర్తిగా నియంత్రణలో ఉండి డాక్టర్ సూచనల ప్రకారం మందులు వాడుతూ, రెగ్యులర్‌గా బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను చెక్ చేయించుకునే వారు పరిమితంగా గుడ్లను తీసుకోవచ్చు. వారంలో రెండు లేదా మూడుసార్లు మాత్రమే తినడం, అందులోను గుడ్డు తెల్ల భాగాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ శాతం తగ్గించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ 3 విత్తనాలను పెరుగుతో కలిపి తింటే కీళ్ల నొప్పులు ఉండవు
గుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైన పుష్కల పోషకాలను అందిస్తాయి. ఇవి పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కానీ బీపీ నియంత్రణలో లేని వారు, లేదా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం గుడ్లను పూర్తిగా మానేయడం మంచిది. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో రేఖలు ఏర్పడి రక్తప్రవాహం సరిగా జరగక గుండె జబ్బులకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మూడు ప్రాణాలు బలిగొన్న అక్రమ సంబంధం..సంగారెడ్డి జిల్లాలో విషాదం
( high-bp | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )