Hand Thread: చేతికి దారం ధరించే విధానం.. దాని ప్రాధాన్యత తెలుసుకోండి

జ్యోతిషశాస్త్ర పరంగా మణికట్టు మీద కట్టిన ఎరుపు రంగు దారం కుజుడిని సూచించే శక్తిగా భావిస్తారు. ఇది శక్తిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. పసుపు రంగు దారం బృహస్పతికి సంబంధించినది. ఇది జ్ఞానం, పురోగతి, శుభ ఫలితాలను అందిస్తుంది.

New Update
A bracelet tied around the wrist

Hand Thread

భారతీయ సంస్కృతిలో అనేక రకాల మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో ఒకటి రాక్షససూత్రం లేదా  దారం ధరించడం. హిందూ మతంలో ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఎరుపు లేదా పసుపు రంగుల దారంతో తయారు చేసిన ఈ కాలవను పూజల సమయంలో చేతికి కట్టడం ఆనవాయితీ. దీనిని మణికట్టుపై కట్టుకోవడం వల్ల శరీరం మరియు మనసుకు రక్షణ కలుగుతుందని నమ్ముతారు. దారం ధరిస్తే శరీరంలో ధైర్యం, శక్తి, శ్రేయస్సు పెరుగుతాయని చెప్పబడుతుంది.  చేతికి దారం కడితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్

మణికట్టు కట్టిన దారం ఎన్ని రోజులకు తీయాలి?

జ్యోతిషశాస్త్ర పరంగా కూడా దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎరుపు రంగు దారం కుజుడిని సూచించే శక్తిగా భావిస్తారు. ఇది శక్తిని, విజయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. పసుపు రంగు దారం బృహస్పతికి సంబంధించినదిగా చూస్తారు. ఇది జ్ఞానం, పురోగతి, శుభ ఫలితాలను అందిస్తుంది. కాలవను ధరించడం ఎంత ముఖ్యమో.. దాన్ని తొలగించే విధానం కూడా అంతే ముఖ్యమైనది. కొన్ని నియమాలు పాటిస్తేనే దాని శుభ ప్రభావం కొనసాగుతుంది. సాధారణంగా ఒకసారి దారం కట్టిన తర్వాత దాన్ని 21 రోజుల పాటు మాత్రమే మణికట్టుపై ఉంచాలని శాస్త్రోక్తంగా చెబుతారు. 21 రోజుల అనంతరం కాలవ యొక్క సానుకూల ప్రభావం ముగుస్తుంది. దాని తరువాత దానిని తొలగించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: ఎముకలకు ప్రాణం పోసే ఆహారాలు.. వీటిని తింటే పీటీ ఉషల పరిగెడుతారు

చాలామంది దీని మీద అవగాహన లేకపోవడంతో నెలల తరబడి అదే  దారం మణికట్టుపై ఉంచుతారు లేదా పాత దారంపైనే మళ్లీ కొత్త దారాన్ని కట్టుకుంటారు. ఇది శాస్త్రాలకు విరుద్ధంగా ఉంటుంది. ఇలా చేస్తే రక్షణ కలిగించే దారం శక్తిని కోల్పోయి ప్రతికూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. దారం తొలగించిన తరువాత దాన్ని అపవిత్ర ప్రదేశాల్లో పారేయకూడదు. దానిని శుద్ధంగా భావించి ఇంట్లోని మొక్కల కుండలో లేదా పొలాల్లో మట్టిలో పాతిపెట్టాలి. ఈ విధంగా ఆ సంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ప్రకృతి పరిరక్షణకూ సహకరించినవారవుతారు. దారం సరైన సమయంలో కట్టడం, సరైన సమయంలో తొలగించడం ద్వారా దాని శుభప్రభావాన్ని పొందవచ్చు. ఇది నిత్యజీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును అందించే ఒక సాధనం అని చెప్పవచ్చు.

Also Read :  భారీ వరద బీభత్సం.. 203 మంది మృతి

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!



( threads | Latest News | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style)

Advertisment
తాజా కథనాలు