SIT Officials: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు డేట్ ఫిక్స్ చేసిన సిట్
కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఫ్రీగా వాట్సాప్ ఎంజాయ్ చేస్తున్నవారు ఇంకా కొన్ని ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే రూల్ తీసుకురానుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 'ప్రీమియం సబ్స్క్రిప్షన్' ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను క్షమాపణలు కోరారు. ఇటీవల పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, ఒకవేళ ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ఆదేశించింది.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ వర్గాలు కలుస్తాయనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. రెండుగా చీలిపోయిన ఎన్సీపీ వర్గాలు ఇప్పుడు కలిసి రావాలని అన్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్ నియామకాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన ట్రంప్, ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
నిఫా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది. దీంతో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు చెప్పింది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.