SIT Officials: కేసీఆర్‌కు బిగ్ షాక్‌.. విచారణకు డేట్‌ ఫిక్స్‌ చేసిన సిట్

కేసీఆర్‌కు సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.

New Update
KCR

KCR

కేసీఆర్‌కు సిట్‌ అధికారులు మరోసారి నోటీసులు(SIT Officials Notices To KCR) జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు. నందినగర్‌ నివాసంలో అందుబాటులో ఉండాలని ఆయనకు సూచించారు. అయితే తనను ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కోరిన కేసీఆర్‌ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు.ఇదిలాఉండగా ఫోన్‌ ట్యాపింగ్ కేసు విషయంలో కేసీఆర్‌కు సిట్‌ అధికారులు గురువారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read :  MLA Kaushik Reddy: పోలీసులకు క్షమాపణ చెప్పిన MLA కౌశిక్ రెడ్డి

SIT Officials Notices To KCR

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని సిట్‌ ఏసీపీ వెంకటగిరి నోటీసులో తెలిపారు. ఈ నోటీసు కాపీని సిట్‌ అధికారులు.. నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లి, అక్కడి సిబ్బందికి అందజేశారు. దీంతో కేసీఆర్‌ సిట్‌ అధికారుకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోనే తనను విచారించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిట్‌ సమయం ఇస్తామంటూ తెలిపింది. అయితే శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో విచారణ చేయాలని కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తిని సిట్‌అధికారులు తిరస్కరించారు. ఫిబ్రవరి 1న విచారిస్తామని.. నందినగర్‌ నివాసంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 

ఫోన్‌ ట్యాంపింగ్‌ కేసులో ఇటీవల మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావులను కూడా సిట్ అధికారులు విచారించారు. జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులు హరీశ్‌రావును సుమారు 7 గంటల పాటు విచారించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం కార్యకలాపాలు, నిధుల వినియోగం, ఎన్నికల సమయంలో పోలీసుల ద్వారా జరిగిన నగదు పంపిణీ ఆరోపణలపై ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా జనవరి 23న సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. విపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని రాజకీయాల కోసం ఎలా వాడుకున్నారనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. విచారణ అనంతరం దీనిపై స్పందించిన కేటీఆర్‌ ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. అబద్ధపు కేసులతో తమను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :  డేంజర్లో హైదరాబాద్.. ఇక్కడ బతకడం ఇక కష్టమేనా?

Advertisment
తాజా కథనాలు