/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
Trump
ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనాకారులకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మరో నాలుగు అరబ్ దేశాలతో కలిసి ఈ దాడులకు సంబంధించిన జాబితాను రూపొందించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది.
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి.2015లో ఒబామా హయాంలో అణు ఒప్పందం జరిగింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక 2018లో దాన్ని ఉల్లంఘించారు. 2025 జూన్‌లో ఇజ్రాయెల్.. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఆ తర్వాత అమెరికా కూడా మరో మూడు కేంద్రాలపై బాంబు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఇరాన్‌ను బెదిరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ట్రంప్.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నాశనం చేయాలని కోరుతున్నారు. అలాగే వాళ్ల దగ్గర ఉన్న బాలిస్టిక్ క్షిపణులను పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇరాన్ తమకు కట్టుబడి ఉండకుంటే దాడులు చేస్తామని హెచ్చరించారు.
Also Read: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి టేబుల్ టాప్ రన్‌వే కారణమా? టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏంటీ?
అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, నాలుగు అరబ్ దేశాలు కలిసి ఇరాన్‌పై దాడులు చేసే ప్రణాళికను రూపొందించాయి. ఇజ్రాయెల్ వార్త పత్రిక ప్రకారం.. ట్రంప్ తన టీమ్‌ను ఓ సైనిక ప్రణాళికను అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. ఈ ప్లాన్ జాబితా రహస్యంగా ఉంది. మరోవైపు ఖతార్, ఒమన్, ఈజిప్ట్ లాంటి దేశాలు ఇరాన్‌పై దాడులు చేయొద్దని కోరుతున్నాయి. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్ అగ్రనాయకులు, IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) కమాండర్లు, భద్రతా దళాలును బలహీనపర్చాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణి కర్మాగారాలు, వాయు రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలను అలాగే అమెరికా మిత్రదేశాలను చేరుకోగల ఇరానియన్ క్షిపణులను నాశనం చేయాలని అనుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇరాన్‌పై దాడులు చేస్తారా ? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు వెళ్లాయని ట్రంప్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ ఈ దాడులు జరిగితే మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: అమెరికా-ఇరాన్ మధ్య కమ్మకుంటున్న యుద్ధమేఘాలు.. అంతం చేస్తామనంటూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us