/rtv/media/media_files/2026/01/30/burgum-wife-catherine-2026-01-30-15-37-10.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Trump) తన కేబినెట్ నియామకాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించిన ట్రంప్, ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బర్గమ్ భార్య కేథరిన్(Burgum wife Catherine) చాలా అందంగా ఉంటుందని, ఆమెను చూశాకే బర్గమ్‌కు ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఆయన బహిరంగంగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాదకద్రవ్యాల కట్టడిపై జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయాలను వెల్లడించారు.
Also Read : అమెరికా-ఇరాన్ మధ్య కమ్మకుంటున్న యుద్ధమేఘాలు.. అంతం చేస్తామనంటూ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
US President Trump Says He Hired Doug Burgum's Wife
BREAKING: Trump just claimed that he hired Doug Burgum because he was attracted to his wife. What an awkward moment.
— Brian Krassenstein (@krassenstein) January 29, 2026
"I saw them riding horses in a video. And I said, 'Who is that?' I was talking about her, not him. I said, 'I'm gonna hire her,' because anybody that has… pic.twitter.com/BE7BqEql0T
ఎన్నికల ప్రచార సమయంలో బర్గమ్ దంపతులు గుర్రపు స్వారీ చేస్తున్న ఒక వీడియోను తాను చూశానని, అందులో కేథరిన్(Kathryn Helgaas) చాలా ఆకర్షణీయంగా కనిపించారని ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఆ వీడియో చూసిన వెంటనే ఆమె ఎవరని ఆరా తీశానని, ఆ తర్వాతే బర్గమ్ వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. కేవలం ఆమె అందాన్ని చూసి ప్రభావితమై, బర్గమ్‌ను తన బృందంలోకి తీసుకోవాలని అప్పుడే నిశ్చయించుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ మాటలు బర్గమ్ ఆయన భార్య కేథరిన్ సమక్షంలోనే అనడం గమనార్హం. ఒక వ్యక్తికి అటువంటి జీవిత భాగస్వామి ఉండటం గొప్ప విషయమని కూడా ఆయన కొనియాడారు.
అయితే, డగ్ బర్గమ్ సామాన్యుడేమీ కాదు. ఆయన ఒక సక్సెస్‌పుల్ బిజినెస్‌మ్యాన్ కాకుండా, నార్త్ డకోటా రాష్ట్రానికి రెండుసార్లు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నేత. ఆయనకు ఉన్న రాజకీయ, పరిపాలనా దక్షతను పక్కన పెట్టి, కేవలం భార్య అందాన్ని బట్టి పదవి ఇచ్చానని ట్రంప్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను కేవలం రూపంతోనే కొలవడం సరికాదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన ధోరణిని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రశంసలు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ, అవి బర్గమ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. - telugu viral news
Also Read : 18 ఏళ్ల తర్వాత భారత్ EU ఒప్పందం.. భారత్‌కు ప్రయోజనం ఉందా?
Follow Us