/rtv/media/media_files/2026/01/30/bihar-tightens-social-media-rules-for-govt-staff-2026-01-30-18-09-10.jpg)
Bihar tightens social media rules for govt staff
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్(bihar) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్‌ను తప్పనిసరి చేసింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ఆన్‌లైన్ వేదికల్లో గైడ్‌లైన్స్(social media rules) రూపొందించింది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు అందరికీ ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే దీనికి రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే ఉద్దేశం లేదని పేర్కొంది. వారు హుందాగా వ్యవహరించేలా చూడటమనే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.
Bihar Tightens Social Media Rules For Govt Staff
బిహార్ సర్కార్ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సంబంధింత ఉన్నతాధికారుల నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. ఫేక్ ఖాతాలను అనుమతించే ప్రసక్తే ఉండదు. అధికారిక హోదా, ప్రభుత్వ లోగోకు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయరాదు. వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లకు ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు లేదా ప్రభుత్వ ఫోన్ నెంబర్లు ఇవ్వరాదు. ఉద్యోగుల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రభుత్వ హోదాతో సంబంధం లేదని చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం.
Also Read: రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన .. ఎలా అరుస్తున్నాడో చూడండి!
అంతేకాదు అశ్లీలంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్‌పై అలాగే కుల, మతాలను టార్గెట్ చేసి అప్‌లోడ్ చేసే పోస్టులపై నిషేధం ఉంటుంది. అధికారిక కార్యక్రమాలు, సమావేశాల వీడియోలు, ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో షేర్ చేయకూడదు. ఎలాంటి కంటెంట్‌ను పోస్టు చేయాలనే దానిపై రూల్స్‌ను స్పష్టంగా చెప్పినట్లు బిహార్ సర్కార్ తెలిపింది.
Follow Us