Nipah Virus: నిఫా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

నిఫా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది. దీంతో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు చెప్పింది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

New Update
WHO reacts as India reports Nipah virus cases

WHO reacts as India reports Nipah virus cases

పశ్చిమబెంగాల్‌లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే చైనా, థాయ్‌లాండ్, నేపాల్, తైవాన్, మలేసియా లాంటి పలు దేశాలు తమ దేశంలోకి వచ్చే భారతీయులకు నిఫా స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. భారత్‌లో నిఫా వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది. దీంతో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు చెప్పింది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read: అజిత్ పవార్‌ విమాన ప్రమాదానికి టేబుల్ టాప్ రన్‌వే కారణమా? టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏంటీ?

నిఫా వైరస్‌ వల్ల భారత్‌పై ప్రయాణ, వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది. ప్రపంచ దేశాలకు దీనివల్ల ప్రమాదం తక్కువేనని చెప్పింది. అంతేకాదు ఈ వ్యాధి సోకిన ఇద్దరు వ్యక్తులు కూడా ఎలాంటి ప్రయాణాలు చేయలేదని భారత ప్రభుత్వం చెప్పినట్లు తెలిపింది. దీంతో భారత్‌లో కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించే ఛాన్స్ లేదని వెల్లడించింది.

Also Read: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ మంచు.. 1200పైగా రోడ్లు మూసివేత

 భారత్‌లో నిఫా కేసులు వెలుగుచూడటంతో చైనా మరింత అప్రమత్తమైంది. భారత్‌తో పాటు వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అక్కడి ఎయిర్‌పోర్టుల్లో స్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటిదాకా తమ దేశంలో నిఫా కేసులు నమోదు కాలేదని తెలిపింది.  

Advertisment
తాజా కథనాలు