Supreme Court: అన్ని స్కూళ్లలో టాయిలెట్లు, బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్లు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ఆదేశించింది.

New Update
Supreme Court

Supreme Court

సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం బాలికలకు నెలసరి ఆరోగ్యం వారి ప్రాథమిక హక్కని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ఆదేశించింది. జస్టిస్ జేపీ పర్దివాలా, ఆర్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలికలు, బాలురతో పాటు దివ్యాంగులకు కూడా ప్రత్యేక టాయిలట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: నిఫా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

Supreme Court Says Right To Menstrual Health A Fundamental Right

ఒకవేళ పాఠశాలల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం, బాలికలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్లు అందిచడంలో విఫలమైతే ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2024 డిసెంబర్ 10 జయ ఠాకూర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే బాలికలకు 'నెలసరి పరిశుభ్రత' విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీనిపై తాజాగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. 

Also Read: అతని భార్యపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ కామెంట్స్ వైరల్

Advertisment
తాజా కథనాలు