/rtv/media/media_files/2026/01/30/imran-khan-2026-01-30-19-22-16.jpg)
imran khan
పాకిస్థాన్(pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(imran-khan) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన కంటి సమస్య(Eye Blindness) తో బాధపడుతున్నారు. వెంటనే చికిత్స అందించకపోతే ఆయన కంటిచూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పలు వార్తా కథనాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో రెటినల్ సిరలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఆయన కంటికి రక్త ప్రసరణ తగ్గి రెటీనా దెబ్బతినే ఛాన్స్ ఉంది.
వెంటనే ఆపరేషన్ లేదా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించకుంటే ఇమ్రాన్ ఖాన్ శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ఛాన్స్ ఉంది. కానీ జైలు అధికారులు ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని అంటున్నారు. దీంతో పీటీఐ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఆపరేషన్ చేసే వసతులు లేవని.. వెంటనే ఆయన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 2024 అక్టోబర్‌లో ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత వైద్యుడితో పరీక్షలు చేయించుకున్నారు. అప్పటినుంచి ఇప్పటిదాకా వైద్యుడిని కూడా కలిసేందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని కానీ జైలు అధికారులు మాత్రం వైద్య టెస్టులకు పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నొరీన్ ఖానుమ్ అడియాలా జైలు బయట ఆందోళనలు చేశారు. ఆయనకు కంటి సమస్య ఉంటే తమకేందుకు చెప్పలేదని నిలదీశారు. ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య సాయంతో పాటు జైలు నుంచి విడుదల చేయాలనేదే తమ డిమాండ్ అంటూ తేల్చిచెప్పారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియా వాడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే
Imran Khan Facing Risk Of Permanent Blindness
మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌ను కలవడం కోసం తమకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ పీటీఐ నేతలు కూడా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. దీనిపై పీటీఐ ఛైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ కూడా స్పందించారు. ఒక ఖైదీని కలవడం చట్టపరమైన హక్కని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ ఆరోగ్యంపై తాము ఆందోళన చెందుతున్నట్లు వాపోయారు. అయితే వీళ్లిద్దరికీ మధ్యంతర బెయిల్‌ను ఇటీవల కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
అయితే ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత నడుమ ఇస్లామాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తారర్ తెలిపార. సుమారు 20 నిమిషాల పాటు చిన్న మెడికల్ ప్రొసీజర్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. తన వ్యక్తిగత వైద్యులను కలిసేందుకు ఇమ్రాన్ ఖాన్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడం, చికిత్సలో ఆలస్యం చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. చాలాకాలంగా ఆయన్ని ఏకాంతంగా ఉంచడం వల్ల మానసికంగా, శారీరకంగా కృంగదీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గతంలో ఆయన భార్య బుష్రా బీబీకి కూడా ఆహారంలో విషం కలిపారంటూ ఇమ్రాన్ ఖాన్ కోర్టులో ఆరోపించారు. అలాగే తనకు స్లో పాయిజనింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆయన లాయర్లు కూడా గతంలో చాలాసార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూడా ఇమ్రాన్‌కు సరైన చికిత్స అందించకుండా హతమార్చే కుట్ర జరుగుతోందని ఆయన మద్దతుదారులు ధ్వజమెత్తుతున్నారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Follow Us