/rtv/media/media_files/2026/01/30/sunetra-pawar-and-ajit-pawar-2026-01-30-16-14-26.jpg)
Sunetra Pawar and Ajit Pawar
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ వర్గాలు కలుస్తాయనే ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహాదిక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. రెండుగా చీలిపోయిన ఎన్సీపీ వర్గాలు ఇప్పుడు కలిసి రావాలని అన్నారు. అజిత్ పవార్ వర్గం నుంచి 41 మంది ఎమ్మెల్యేలు, శరద్ పవార్ వర్గం నుంచి 10 మంది ఎమ్మెల్యేలతో ఈ పార్టీకి బలం ఉందని పేర్కొన్నారు. అందుకే వీళ్లు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సునేత్రా పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆమె సమర్థవంతంగా పనిచేయగలరని అన్నారు.
మరోవైపు శుక్రవారం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ సీనియర్ నేతలు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. ఈ భేటీకి హాజరైన వాళ్లలో ఛగన్ భుజ్‌బాల్, ప్రఫుల్ పటేల్, NCP ముంబై చీఫ్ సునీల్ తట్కరే తదితరులు ఉన్నారు.
Also Read: కాంగ్రెస్ MP శశి థరూర్ పార్టీ మార్పుపై క్లారిటీ.. అగ్రనేతలతో గంటన్నర భేటీ!
ఇదిలాఉండగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమెకు పోటీగా వాళ్ల బంధువు సుప్రియా సులే బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సులేనే ప్రజలు గెలిపించారు. దీంతో సునేత్ర పవార్ రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి. అజిత్ పవార్ తన భార్యను రాజ్యసభకు పంపాలని అనుకున్నారు. దీంతో గతేడాది జూన్ 25న సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే అజిత్ పవార్, శరద్ పవార్ పార్టీ విలీనానికి సంబంధించి ఓ ఒప్పందానికి వచ్చినట్లు NCP వర్గాలు తెలిపాయి. విలీనం ప్రకటనకు ఫిబ్రవరి 8వ తేదీని నిర్ణయించినట్లు తెలిపాయి. కానీ ఇంతలోనే జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో మరణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు బారామతి నియోజకవర్గంలో ఆయన స్థానం ఖాళీ అవ్వడంతో సునేత్ర పవార్ బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈమెకే డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలని అజిత్ వర్గం శ్రేణులు కోరుకుంటున్నారు. మరికొందరు నేతలు ఇరు వర్గాలు కలిసిపోవాలని భావిస్తున్నారు. మరీ ఈ రెండు వర్గాలు విలీనం అవుతాయా ? లేదా ? అని తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే.
Also Read: అతని భార్యపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు.. ట్రంప్ కామెంట్స్ వైరల్
Follow Us