ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!
హైదరాబాద్ లో ఉదయం నుంచి పలువురి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత దిల్ ఇల్లు, ఆఫీసులో కూడా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అయన భార్య తేజశ్వినిని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయమని అడగ్గా.. లాకర్స్ ఓపెన్ చేసి చూపించినట్లు తేజశ్విని తెలిపారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.
Jan 21, 2025 11:51 IST
ఎంతకు తెగించార్రా : ఆలయంలో అపచారం.. ఏకంగా గర్భగుడిలోనే
కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడిలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ కోసం గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరిపారు. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి మరి ఆల్బమ్ షూటింగ్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సైఫ్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.
Saif ali khan Photograph: (Saif ali khan)
Jan 21, 2025 10:19 IST
Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..?
ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.
Supreme Court
Jan 21, 2025 10:05 IST
తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్తను పంచుకున్నారు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మా ప్రేమ 2 అడుగుల పెరుగుతోంది' అంటూ భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
KIRAN ABBAVARAM
Jan 21, 2025 10:05 IST
భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్‌పీఎఫ్ , కొబ్రా సిబ్బందితో కూడిన బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది
Jan 21, 2025 10:04 IST
పడింది దెబ్బ..సిటిజెన్ షిప్‌కు టాటా గుడ్‌బై..ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్
ఇక చాలు..వందేళ్ళుగా చాలా ఇచ్చాం...ఇక మీదట కుదరదు అని తేల్చి చెప్పేశారు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్. అమెరికాలో పుట్టే ఇతర దేశాల పిల్లలకు సిటిజెన్ షిప్‌కు స్వస్తి పలికారు. వందేళ్ళుగా ఇస్తూ వస్తున్న ఈ హక్కును క్యాన్సిల్ చేశారు.
Jan 21, 2025 09:36 IST
తగ్గేదేలే : ట్రంప్ మరో సంచలనం.. డబ్ల్యూహెచ్‌ఓకు గట్టి స్ట్రోక్
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తగ్గేదేలే అంటూ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్‌ఓ నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అతిపెద్ద డోనర్.
who trump Photograph: (who trump)
Jan 21, 2025 09:05 IST
పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు పెరిగింది. 'పుష్ప-2' మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.
మరో వారం రోజులు ఇంతే.. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండలే!
Jan 21, 2025 09:03 IST
కొత్త రేషన్ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు
Jan 21, 2025 08:41 IST
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు.
Jan 21, 2025 08:40 IST
ట్రంప్కు షాకిచ్చిన వివేక్ రామస్వామి .. కీలక నిర్ణయం!
వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే వివేక్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Trump and vivek Photograph: (Trump and vivek)
Jan 21, 2025 08:12 IST
దిల్ రాజుకు బిగ్ షాక్.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంటితో పాటుగా హైదరాబాద్ లోని 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు,ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేపట్టారు.
IT raids dil raju Photograph: (IT raids dil raju)
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి