/rtv/media/media_files/2025/01/11/CSKitxqU0gxTTTIMzCxn.jpg)
Donald Trump
ఏ దేశం పిల్లలకు వారి పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొన్ని దేశాలు మాత్రం తమ దేశంలో వేరే దేశాల పిలలు పుట్టినా వారికి సిటిజెన్ షిప్‌ను ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ పౌరసత్వ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వాటిల్లో అగ్రగామిగా అమెరికా ఉండేది నిన్నటి వరకూ. వందేళ్ళ నుంచి అమెరికాలో పుట్టిన ఇతర పిల్లలకుసిటిజెన్ షిప్‌ను ఇస్తోంది అమెరికా ప్రభుత్వం. ఇది చాలా దేశాల వారికి బెనిఫిషియల్‌గా ఉండేది. ముఖ్యంగా భారతీయులు అమెరికాలో పిల్లను కనేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా సిటిజెన్ షిప్ ఉంటే పిల్లలు చదువులకు, వాళ్ళ సెటిల్ మెంట్‌కు మంచి అవకాశాలుంటాయి. అమెరికా పౌరుల కింద పరిగణించబడతారు కాబట్టి వారికి కూడా అ దేశంలో ఇచ్చే సదుపాయాలు అన్నింటికీ అర్హులవుతారు. అందుకే అమెరికా సిటిజెన్ షిప్‌కు అంత ప్రాముఖ్యత ఉంది.
Also Read: AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్
పడింది దెబ్బ...
కానీ ఇప్పుడు సిటిజెన్ షిప్‌ను రద్దు చేశారు కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. నిన్న అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేస్తానని చెప్పారు. అందులో ఇది కూడా ఒకటి. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు అంటూ ఈ ఆర్డర్ పై సంతకం చేసిన ట్రంప్ చెప్పారు. అమెరికా మాత్రమే ఇలాంటి ఫెసిలిటీ ఇస్తోందని కూడా అన్నారు. ఆ కారణంగానే అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు ఇస్తున్న సిటిజెన్ షిప్‌ను ట్రంప్ రద్దు చేశారు. ఈ కొత్త అమెండ్‌మెంట్ అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. అయితే ఇది న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: తగ్గేదేలే : ట్రంప్ మరో సంచలనం.. డబ్ల్యూహెచ్‌ఓకు గట్టి స్ట్రోక్