Mythri Movie Makers
Mythri Movie Makers: హైదరాబాద్ లో ఐటీ అధికారుల దూకుడు పెరిగింది. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీఎస్ ఛైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఈరోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. అలాగే ఆయన సోదరులు శిరిష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
BREAKING NEWS
— Movies4u Official (@Movies4u_Officl) January 21, 2025
IT Raid on Mythri Movie Makers producer - #Naveen , CEO Cherry and others. #Tollywood pic.twitter.com/cnoSkrN7DU
మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ
అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఇటీవలే విడుదలైన అల్లు అర్జున్ 'పుష్ప 2' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. అంతే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మేకర్స్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మైత్రి సంస్థ జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, వీర సింహారెడ్డి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది.
సుకుమార్ తెరకెక్కించిన పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యారు. సినిమాలోని బన్ని డైలాగ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సాంగ్స్, డ్యాన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జాతర సీన్ హైలైట్ గా నిలిచింది. రష్మిక మందన్న , ఫహాద్ ఫాజిల్ తమ నటనతో మెప్పించారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!