Supreme Court: గోధుమ పిండి, వాటర్ బాటిళ్లకు హలాల్ సర్టిఫికేట్ అవసరమా..?

ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్‌ వస్తువులపై యోగి ప్రభుత్వం నవంబరు 2023లో నిషేధం విధించగా... దీనిని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో.

New Update
SUPREME COURT

యూపీలో హలాల్ సర్టిఫికెట్ (Halal Certificate) ఉత్పత్తుల నిషేధం అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఇనుప కడ్డీలు, సిమెంట్‌ వంటి ఉత్పత్తులకు హలాల్‌ సర్టిఫికెట్ అవసరమా? అనే ప్రశ్న లేవనెత్తారు. హలాల్‌ సర్టిఫికెట్ కలిగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై యూపీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. 

Also Read: Telangana: కొత్త రేషన్‌ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు

Halal Certificate

‘మాంసం ఉత్పత్తులకు హలాల్‌ ధ్రువీకరణ ఉండాలనే వాదనపై ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ, షాకింగ్ ఏంటంటే సిమెంటు, ఇనుప కడ్డీలు, బాటిల్స్‌కు కూడా ఈ సర్టిఫికెట్ రావడమే విచిత్రం’ అని తుషార్‌ మెహతా అన్నారు.హలాల్‌ సర్టిఫికెట్ జారీచేసే సంస్థలు పెద్దమొత్తాల్లో వసూలు చేస్తున్నాయని, ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో ఉందని ఆయన వివరించారు. ‘గోధుమ పిండి, శెనగపిండి, నీళ్ల సీసాల వంటి వస్తువులకూ హలాల్‌ అవసరమా?’ అని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. 

Also Read: Telangana: మరో వారం రోజులు ఇంతే.. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండలే!

దీనిపై పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ లాయర్ ఎంఆర్ షంషాద్ స్పందిస్తూ.. హలాల్‌ సర్టిఫికెట్ పొందడం స్వచ్ఛంద వ్యవహారమేనని, దాన్ని తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమేనని, జీవన విధానానికి సంబంధించిందని పేర్కొన్నారు. ఎవరికివారు స్వచ్ఛందంగా దీనిని పొందవచ్చని వివరించారు.

ఈ విషయమై అఫిడవిట్‌ దాఖలు చేయాలనిజస్టిస్ అగస్టిన్ జార్జ్ మస్హి జస్టిస్ బీఆర్ గవాయ్ ల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 24 తరువాత చేపడతామని పేర్కొంది. నవంబరు 2023లో ఉత్తర్ ప్రదేశ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హలాల్ సర్టిఫికెట్ వస్తువుల విక్రయాలపై నిషేధం విధిస్తూ.. తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. హలాల్ సర్టిఫికెట్‌తో వినియోగదారులపై అధిక భారం పడుతోందని పేర్కొంది.

ఆహార ఉత్పత్తుల 'హలాల్' సర్టిఫికేషన్ నాణ్యత విషయంలో గందరగోళాన్ని సృష్టించే సమాంతర వ్యవస్థగా పనిచేస్తుందని యూపీ ప్రభుత్వం తన అఫిడ్‌విట్‌లో వెల్లడించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రాథమిక ఉద్దేశ్యానికి పూర్తిగా విరుద్ధమని తెలిపింది.

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

Also Read:  APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు