/rtv/media/media_files/2025/01/21/lllo3Fq6RIFNDdy3aJ0R.jpg)
Trump and vivek Photograph: (Trump and vivek)
భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన డోజ్ బాధ్యతలను ఎలాన్ మస్క్‌తోపాటు వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
It was my honor to help support the creation of DOGE. I’m confident that Elon & team will succeed in streamlining government. I’ll have more to say very soon about my future plans in Ohio. Most importantly, we’re all-in to help President Trump make America great again! 🇺🇸 https://t.co/f1YFZm8X13
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 20, 2025
ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకే వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో స్పష్టత ఇస్తానని ఎక్స్‌లో పోస్టు పెట్టారు రామస్వామి. ఈ సందర్బంగా వివేక్ రామస్వామి తన ట్వీట్ లో డోజ్ శాఖ సృష్టికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, ఎలాన్ మస్క్ బృందం దానిని సమర్థవంతంగా నడిపిస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ రామస్వామి తన ట్వీట్ లో తెలిపారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పని చేస్తోంది.
అమెరికాలో రామస్వామికి రోవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ ఉంది. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి, ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, విరాళంగా 100 మిలియన్ డాలర్లు అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు.
ఎవరీ వివేక్ రామస్వామి
వివేక్ రామస్వామి ఒహియోలోని సిన్సినాటిలో ఆగస్టు 9, 1985న భారతీయ వలస తల్లిదండ్రులకు జన్మించాడు. ఆయన తండ్రి గణపతి రామస్వామి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నుంచి పట్టభద్రుడయ్యాడు. జనరల్ ఎలక్ట్రిక్ కోసం ఇంజనీర్ అండ్ పేటెంట్ అటార్నీగా పనిచేశాడు. అతని తల్లి, గీతా రామస్వామి, మైసూర్ మెడికల్ కాలేజ్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ తీసుకుని వృద్ధాప్య మానసిక వైద్యురాలిగా పనిచేశారు.
వివేక్ రామస్వామి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. తర్వాత సిన్సినాటిలోని సెయింట్ జేవియర్ హై స్కూల్‌లో చదివారు. ఇక 2007లో, రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి జీవశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో సుమ్మ కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు. అతను ఫై బీటా కప్పా.. హార్వర్డ్ పొలిటికల్ యూనియన్ సభ్యుడు, తరువాతి అధ్యక్షుడిగా పనిచేశాడు.
Also Read : దిల్ రాజుకు బిగ్ షాక్.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు