హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్

నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సైఫ్‌ను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.

New Update
Saif ali khan

Saif ali khan Photograph: (Saif ali khan)

బాలీవుడ్ (Bollywood) నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మంగళవారం డిశ్చార్జ్ కానున్నారు. లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని వెల్లడించారు.  2025 జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు సైఫ్‌ను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల బాంద్రాలోని తన ఇంట్లో చోరీకి ప్రయత్నించిన సైఫ్‌పై ఓ ఆగంతకుడు  కత్తితో దాడి చేశాడు. ఇది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Saif Ali Khan Discharge

Also Read :  కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే .. కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్‌ను తెల్లవారుజామున 2:30 గంటలకు ఆటోరిక్షాలో లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ సైఫ్‌కు డాక్టర్లు రెండు ఆపరేషన్లు చేశారు.  సైఫ్‌ వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన  నిందితుడు ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. గత 5 నెలలుగా ముంబైలోనే  ఉన్నట్లుగా గుర్తించారు.  ముంబైలో హౌస్‌ కీపింగ్‌ వంటి చిన్నచిన్న పనులు చేసినట్లు గుర్తించారు. 

Also Read :  భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు! వీడియో వైరల్

సైఫ్‌పై దాడికి సంబంధించిన విచారణలో పోలీసులు నిందితుడి వేలిముద్రలను సేకరించారు. దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలున్నాయి.  ఇంట్లోని కిటికీలపై, ఇంట్లోకి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్‌ బృందం గుర్తించింది. 

Also Read : భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి

Also Read : TS Inter Students: ఇంటర్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు