/rtv/media/media_files/2025/01/21/SadB77Trbr2iNTp5p5lB.jpg)
IT raids dil raju Photograph: (IT raids dil raju)
టాలీవుడ్ నిర్మాత, ఎఫ్డీఎస్ ఛైర్మన్ దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. 2025 జనవరి 21వ తేదీ మంగళవారం తెల్లవారుజామునుంచే ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు,ఆఫీసుల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన సోదరులు శిరిష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు ఇంటితో పాటుగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
IT raids on #DilRaju today in Hyderabad #GameChanger #SankranthikiVasthunam https://t.co/AyayZ4s8qw
— Telugu Premiere (@TeluguPremiere) January 21, 2025
ఇటీవల సంక్రాంతికి రిలీజైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి కూడా డిస్టిబ్యూటర్ గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు డిస్టిబ్యూటర్ నుంచి ఎదిగారు. దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. భద్ర, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గేమ్ ఛేంచర్ వంటి చిత్రాలతో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ దిల్ రాజుకు ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదు కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాత్రం భారీ వసూళ్లనే సాధించింది. రిలీజైన మూడు రోజుల్లోనే వంద కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.