Private Album Shooting: ఎంతకు తెగించార్రా : ఆలయంలో అపచారం.. ఏకంగా గర్భగుడిలోనే

కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.  గర్భగుడిలో ఓ  ప్రైవేట్‌ ఆల్బమ్‌ షూటింగ్‌ కోసం గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరిపారు. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి మరి ఆల్బమ్‌ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

author-image
By Krishna
New Update
kaleshwara mukteswara swamy temple

kaleshwara mukteswara swamy temple Photograph: (kaleshwara mukteswara swamy temple)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం (Kaleshwara Mukteswara Swamy Temple) లో అపచారం చోటుచేసుకుంది.  గర్భగుడిలో ఓ  ప్రైవేట్‌ ఆల్బమ్‌ షూటింగ్‌ (Private Album Shooting) కోసం గుడి తలుపులు మూసి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ జరిపారు. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి మరి ఆల్బమ్‌ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆల్బమ్‌ షూటింగ్‌పై దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల భక్తులు ఫైర్ అవుతున్నారు.  ఆలయ పవిత్రతను అధికారులు దెబ్బతీశారని భక్తుల ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Also Read :  కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతే .. కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు

సాధారణంగా గుడిలోకి ఫోన్లనే అనుమతించరు. అలాంటిది ఏకంగా కెమెరాలను తీసుకెళ్లి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ లకు అధికారులే పర్మిషన్స్ ఇచ్చారా అన్న అనుమానులు కలుగుతున్నాయి. దీనిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించి వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చూసి చూడనట్టు వదిలేస్తే  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయని భక్తులు మండిపడుతున్నారు.  

Also Read :  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్

ఆలయ చరిత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలసిన ఆలయం ఉంది.  పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది,  శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.  సాధారణంగా గర్భగుడి లో ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒక్కటే కదా !! కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో.

Also Read :  ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి

Also Read :  భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు! వీడియో వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు