Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్తను పంచుకున్నారు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'మా ప్రేమ 2 అడుగులు పెరుగుతోంది' అంటూ భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

New Update
KIRAN ABBAVARAM

KIRAN ABBAVARAM

Kiran Abbavaram:  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'మా ప్రేమ 2 అడుగుల పెరుగుతోంది' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

2024లో వివాహం 

కిరణ్ గతేడాది ఆగస్టు 22న నటి రహస్య గోరక్ ని  వివాహం చేసుకున్నారు. కర్ణాటకలోని కూర్గ్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 'రాజాగారు రాణివారు'  సినిమాతో ఏర్పడిన కిరణ్, రహస్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట 2024లో మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. 

Also Read: Telangana: కొత్త రేషన్‌ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు

రీసెంట్ గా 'క' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కిరణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. 1970 బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగిన ఈ  సినిమా కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకులు, సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కిరణ్ అబ్బవరం స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సుజిత్, సుదీప్ బ్రదర్స్ తెరకెక్కించారు. 'రాజావారు, రాణి గారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

#telugu-news #kiran-abbavaram #tollywood #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు