Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!

హైదరాబాద్ లో ఉదయం నుంచి పలువురి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్మాత దిల్ ఇల్లు, ఆఫీసులో కూడా సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో అయన భార్య తేజశ్వినిని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయమని అడగ్గా.. లాకర్స్ ఓపెన్ చేసి చూపించినట్లు తేజశ్విని తెలిపారు.

New Update

Dil Raju: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.  మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉదయం నుంచి టాలీవుడ్ నిర్మాతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసులో సోదాలు చేపట్టారు. అలాగే దిల్ రాజ్ సోదరులు శిరిష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

దిల్ రాజ్ భార్యతో బ్యాంక్ లాకర్ ఓపెన్.. 

ఈ క్రమంలో దిల్ రాజు భార్య తేజశ్వినిని బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయమని  అడగ్గా.. ఓపెన్ చేసి చూపించినట్లు తేజశ్విని తెలిపారు. అలాగే అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగారట. ఉదయం నుంచి దిల్‌రాజు ఇంట్లో పలు రికార్డులను పరీశిలించినట్లు తెలుస్తోంది.  సంక్రాంతి సినిమాల పెట్టుబడులు, వచ్చిన ఆదాయంపైనే అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. మైత్రీ సంస్థ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్  'పుష్ప 2'  నిర్మించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం.. అంతే భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మేకర్స్ కి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.  మైత్రి సంస్థ  జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం, వీర సింహారెడ్డి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు