Bhavani Shankari: 8 గంటలు రిస్క్ తీసుకుని 82 మందిని కాపాడిన సబ్ కలెక్టర్!
8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 82 మంది వరద బాధితులను కాపాడిన ఏపీ నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకరీపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రమాదానికి ఎదురొచ్చి తమను రక్షించిన కలెక్టర్కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. భవానీ శంకరీ వీడియోలు వైరల్ అవుతున్నాయి.