Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అయినప్పటికి తమకున్న అణుశక్తితో ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ దేశం దాదాపు 200 టన్నుల యూరేనియాన్ని సినిమా లెవెల్లో దొంగతనం చేసింది.
భారత్ మిత్ర దేశమైన రష్యా పాకిస్థాన్‌కు సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల కోసం రష్యా తమ ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో తాజాగా రష్యా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
అమృత్సర్ నుంచి బ్రిటన్‌లోని బిర్మింగ్హామ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ల్యాండింగ్ టైంలో ఎమర్జెన్సీ పవర్ అందించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. సిబ్బంది అప్రమత్తమై విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. నిరసనకారుల ప్రతినిధి బృందం, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC)తో శనివారం రాత్రి ఓ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఇజ్రాయెల్-గాజా యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు.
లాస్ ఏంజిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఏరోస్పేస్ కంపెనీ 'ఇన్వర్షన్' ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ డెలివరీ వాహనం 'ఆర్క్'ను ఆవిష్కరించింది. అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగి వచ్చి, సురక్షితంగా అత్యంత విలువైన వస్తువులను చేర్చగల సామర్థ్యం దీని సొంతం.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. శనివారం అర్థరాత్రి భూమి ఒక్కసారిగా కంపించింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.
దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది.