Israel: సినిమా లెవెల్లో యురేనియం దొంగతనం.. ఇజ్రాయెల్ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాకే

ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అయినప్పటికి తమకున్న అణుశక్తితో ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ దేశం దాదాపు 200 టన్నుల యూరేనియాన్ని సినిమా లెవెల్‌లో దొంగతనం చేసింది.

New Update
Israel

Israel

ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అయినప్పటికి తమకున్న అణుశక్తితో ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఈ దేశం దాదాపు 200 టన్నుల యూరేనియాన్ని సినిమా లెవెల్‌లో దొంగతనం చేసింది. దీనికోసం తమ మిత్రదేశమైన అమెరికాను కూడా వాడుకొని బరిడీ కొట్టించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ఫ్రాన్స్‌కు దగ్గరైన ఇజ్రాయెల్

1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పొరుగు దేశాలు ఆ దేశంతో యుద్ధాలకు దిగాయి. దీంతో ఇజ్రాయెల్ అమెరికా సాయంతో పొరుగు దేశాలను ఓడించింది. తమ చుట్టూ ఉన్న మిత్ర దేశాలతో ముప్పు ఉందని గ్రహించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ మొదటి ప్రధాని డేవిడ్ బెన్‌ గురియన్‌ తమ దేశాన్ని అణుశక్తిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో యూరేనియం నిల్వల కోసం తమ దేశంలో నెగెవ్ ఏడారీలో గాలించారు. కానీ ఎక్కడా కూడా దొరకలేదు. చివరికి 1950ల్లో ఇజ్రాయెల్ అటామిక్ కమిషన్‌ను స్థాపించింది. 1965లో సూయజ్ సంక్షోభం రావడంతో ఇజ్రాయెల్ అమెరికాపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దగ్గరయ్యాయి.  

Also Read: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!

అణు రియాక్టర్ ఏర్పాటు

ఫ్రాన్స్‌ సాయంతో ఇజ్రాయెల్ డిమోన అనే ప్రాంతంలో భారీ అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసింది. ఐరోపా సాంకేతికత, నిపుణుల సాయం ద్వారా దీన్ని నిర్మించారు. ఇందులో భూగర్భ బంకర్లలో అణుబాంబులకు వాడే ప్లుటోనియంను ఉత్పత్తి చేయొచ్చు. ఈజిప్టును కంట్రోల్ చేసేందుకు ఫ్రాన్స్ ఇలా చేసినట్లు సమాచారం. అయితే ఓరోజు అమెరికా నిఘా విమానం నెగెవ్ ఎడారిపై నుంచి వెళ్తుండగా భారీ కాంక్రిట్‌ డోమ్ ఆకారంలో ఉన్న ఆ భవనం ఫొటోలు తీసింది. ఇది టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ అంటూ ఇజ్రాయెల్ అమెరికాను నమ్మించింది.  
చివరికి CIA దీన్ని పరిశీలించి అది అణు రియాక్టర్‌గా గుర్తించింది. అప్పడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జాన్.ఎఫ్ కెనడీ దృష్టికి ఈ విషయం చేరింది. తమ అధికారులు ఆ భవనాన్ని పరిశీలించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆయన ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ మాత్రం కేవలం సందర్శనకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అలాగే పశ్చిమాసియాలోకి కొత్త ఆయుధాలు తీసుకురామని కూడా అమెరికాకు చెప్పింది. అమెరికా టీమ్ వచ్చే సమయానికి ప్లూటోనియం రీప్రాసెసింగ్ కేంద్రానికి వెళ్లే మార్గాలను ఇజ్రాయెల్ ఫేక్ గోడలతో మూసివేసింది. 

డిమోనలో అణు రియాక్టర్ చాటున బాంబు తయారు చేయాలంటే శుద్ధి చేసిన యురేనియం కావాలి. దీంతో ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్లను మొదలుపెట్టింది. అమెరికాలోని అపొలో సిటీలోని 'ది న్యూక్లియర్‌ మెటిరియల్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్పొరేషన్‌'(న్యుమెక్‌)ను ఇజ్రాయెల్ ఏజెంట్లు టార్గెట్ చేశారు. దాని యజమాని జల్మాన్ షపిరో యూదు సానుభూతిపరుడు కావడంతో వాళ్లు అతడితో పరిచయం పెంచుకుని తరచుగా ఆ కేంద్రానికి వెళ్లేవారు. 

Also Read: పాకిస్థాన్‌కు సాయం చేస్తున్న రష్యా ?.. భారత్‌కు వెన్నుపోటా ?

యురేనియం దొంగతనం

అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో దశల వారీగా 200-600 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియాన్ని దొంగిలించి ఇజ్రాయెల్‌కు చేర్చారు. 1969లో అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసెంజర్‌ ఇజ్రాయెల్ అణు కార్యక్రమంలో వినియోగిస్తున్న యురేనియం అమెరికా నుంచే అపహరించిందేనని గుర్తించారు. ఇది రాజకీయంగా వివాదం అవుతుందని ఈ విషయాన్ని అమెరికా బయటకు రానియ్యలేదు.  

ఇక 1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం జరిగన తర్వాత డిమోనా రియాక్టర్‌కు ఫ్రాన్స్ కూడా యురేనియం సరఫరా ఆపేసింది. కానీ ఈ భారీ రియాక్టర్ పనిచేయాలంటే యురేనియం పెద్ద ఎత్తున కావాలి. ఇందుకోసం ఇజ్రాయెల్ నిఘా విభాగాలు ప్లమ్‌బాట్ అనే ఓ ఆపరేషన్‌ను చేపట్టాయి.  ఓ జర్మన్ పెట్రో కెమికల్ కంపెనీ అధికారితో పరిచయం పెంచుకుని బెల్జియంలోని యూనియన్ మైనర్స్ సంస్థ నుంచి ఏకంగా 200 టన్నుల యురేనియంను కొనేలా చేసింది. అప్పటికే ఇజ్రాయెల్ మొస్సాద్‌ ఏజెంట్లు లైబిరియాలో ఓ షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేసి రెడీగా ఉన్నారు. 

ఇజ్రాయెల్ నౌకలోకి యురేనియం

యూనియన్ మైనర్ల్ కాంగోలోని ఓ గని నుంచి 200 టన్నుల ముడి యురేనియంను వెలికి తీసింది. దాన్ని లైబిరియాలో మొస్సాద్‌కు చెందిన కంపెనీ నౌకలో లోడ్ చేసేశారు. వాటిపై ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ప్లమ్‌బాట్ అని రాసి ఉంది.  ఆ నౌకలో అప్పటికే ఉన్న స్పానిష్ సిబ్బందిని తొలగించి మొస్సాద్‌ మనుషులను ఫోర్జరీ పాస్‌పోర్టులతో చేర్చుకున్నారు. చివరికి 1968 నవంబర్‌లో ఆ నౌక ఐరాపాకు బయలుదేరింది. 7 రోజులు ప్రయాణం చేశాక సముద్రం మధ్యలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ నౌక వద్దకు వచ్చింది. అక్కడ యురేనియం డ్రమ్ములను ఇజ్రాయెల్‌ నౌకలోకి మార్చేశారు. లైబిరియా పతాక నౌక 8 రోజుల తర్వాత ఖాళీగా టర్కీ రేవులో కనిపించింది.  

మొత్తానికి అణుబాంబులు తయారు చేసేందుకు కావాల్సిన సామగ్రి, డిజైన్లు, టెక్నాలజీని ఇజ్రాయెల్‌ అక్రమంగా సంపాదించింది. ఇక అణుబాంబుల తయారీకి రెడీ అయిపోయింది. 1967-73 మధ్య అరబ్‌లతో జరిగిన యుద్ధాల్లో అణుబాంబులను వాడాలని నిర్ణయించుకున్నప్పటికీ అది కుదరలేదు. చివరికి అమెరికా-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిరింది. అత్యాధునిక ఆయుధాలు ఉంటే అణు బాంబులు అవసరం లేదని అమెరికా భావించింది. దీంతో భారీగా ఇజ్రాయెల్‌కు అత్యాధునిక ఆయుధాలను పంపించింది.  

అయితే దక్షిణాఫ్రికా నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ది ప్రన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్స్‌లో ఇజ్రాయెల్ అణు బాంబు పరీక్షలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1979 సెప్టెంబర్ 22న ఈ ఐలాండ్ నుంచి రెండు బలమైన లైటింగ్స్‌ వచ్చాయి. అమెరికాకు చెందిన ఓ నిఘా శాటిలైట్‌ దీన్ని కనిపెట్టింది. ఈ కాంతిలో గామా, ఎక్స్‌ కిరణాలు, న్యూట్రాన్లు వెలువడినట్లు గుర్తించింది. ఇది అణు పేలుడే అని తేల్చిచెప్పింది. కొన్ని బ్రిటన్ ల్యాబ్‌కు కూడా అది అణు బాంబు పేలుడే అని తెలిపాయి. దీనిపై దర్యాప్తు చేయగా నైరుతీ ఆస్ట్రేలియాలో అణు కణాలు పడినట్లు గుర్తించారు. మొత్తానికి ఇజ్రాయెల్ వద్ద అణు బాంబులు ఉన్నాయనే విషయం అరబ్ దేశాలకు తెలిసిపోయింది. దీంతో అరబ్‌ ప్రపంచం ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు వెనకడుగు వేశాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం తమ అణుశక్తి గురించి బహిరంగంగా ఎప్పుడూ చెప్పుకోలేదు.

Advertisment
తాజా కథనాలు