BREAKING: ఎలాన్‌ మస్క్ సంచలన ప్రకటన.. వికీపిడియాను తలదన్నేలా గ్రోకీపీడియా

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ గ్రోక్‌కు సంబంధించి మరో సంచలన అప్‌డేట్ ఇచ్చారు. వికీపీడియా తరహాలో గ్రోకీపీడియా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

New Update
Elon Musk confirms Grokipedia Version 0.1 coming soon

Elon Musk confirms Grokipedia Version 0.1 coming soon

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ గ్రోక్‌కు సంబంధించి మరో సంచలన అప్‌డేట్ ఇచ్చారు. వికీపీడియా తరహాలో గ్రోకీపీడియా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీని 0.1 బీటా వెర్షన్ మరో రెండు వారాల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.  ఓ యూజర్‌ గ్రోకీపిడియాను ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్‌ఏఐ రెడీ చేస్తోందని ఎక్స్‌లో పోస్టు చేశాడు. మనుషులకు, ఏఐకి ప్రపంచంలో అత్యంత కచ్చితమైన నాలెడ్జ్‌ సోర్స్, దీనికి సరిహద్దులు లేవని పేర్కొన్నారు. ఈ పోస్టును ఎలాన్‌ మస్క్‌ రీపోస్టు చేశారు. 

Also Read: ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?

అయితే గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్ల గురించి మాత్రం ఎలాన్ మస్క్‌ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. కానీ సమాజంలో ప్రజలకు నిజాలను అందించడం కోసమే ఈ ప్లాట్‌ఫామ్‌ను తయారుచేస్తున్నారు మస్క్. గత నెలలో కూడా మస్క్ గ్రోకీపీడియాకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు. తాజాగా దీని బీటా వెర్షన్ డేటా గురించి చెప్పడం ప్రధాన్యం సంతరించకుంది. ఎక్స్‌ యాప్‌తోనే గ్రోకీపిడియాను లింక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: మరో రెండ్రోజులు వణుకు పుట్టించే వెదర్.. ఈ 5 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

Advertisment
తాజా కథనాలు