Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్

అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బిర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శనివారం సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ల్యాండింగ్ టైంలో ఎమర్జెన్సీ పవర్ అందించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. సిబ్బంది అప్రమత్తమై విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు.

New Update
RAT opened

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం లాంటి మరో ఘోర విమాన ప్రమాదం తప్పింది. దీంతో వందల మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బిర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శనివారం సాంకేతిక లోపం(technical-issue) తలెత్తింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎమర్జెన్సీ పవర్ అందించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకుంది. ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్(Emergency engine deploy) అయింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Also Read :  పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!

Ram Air Turbine Opens During Landing

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI117) బిర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం కింది నుంచి రామ్ ఎయిర్ టర్బైన్ ఆటోమేటిక్‌గా బయటకు వచ్చింది. సాధారణంగా విమానంలోని రెండు ఇంజిన్‌లు లేదా కీలకమైన ఎలక్ట్రికల్/హైడ్రాలిక్ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ RAT పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించి అత్యవసర శక్తిని ఉత్పత్తి చేసి, విమానాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

Also Read :  డార్జిలింగ్‌లో బీభత్సం.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. ఆరుగురు మృతి

ఈ ఘటన జరిగినప్పుడు విమానంలోని విద్యుత్, హైడ్రాలిక్ పారామీటర్లు అన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. "ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తదుపరి తనిఖీల కోసం నిలిపివేశాం. దీని కారణంగా, బిర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన రిటర్న్ ఫ్లైట్ (AI114) రద్దు చేయబడింది, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము" అని ఎయిర్‌లైన్ పేర్కొంది.

మళ్ళీ అదే విమానం...
ఇదే తరహా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం గతంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కూలిపోయిన నేపథ్యంలో ఈ తాజా సంఘటన కొంత ఆందోళన కలిగించింది. అయితే, ప్రస్తుత ఘటనలో ఇంజిన్‌లలో ఎలాంటి సమస్య లేనప్పటికీ RAT ఎందుకు తెరుచుకుందని దానిపై ఎయిర్‌లైన్ లోతైన దర్యాప్తుకు ఆదేశించింది. భద్రతా వ్యవస్థ పటిష్టత వల్లే పెను ప్రమాదం తప్పిందని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు