Los Angeles: పార్సల్ డెలివరీల్లో కొత్త ట్రెండ్.. నేరుగా ఆకాశం నుంచే అందుకోవచ్చు!

లాస్ ఏంజిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఏరోస్పేస్ కంపెనీ 'ఇన్వర్షన్' ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ డెలివరీ వాహనం 'ఆర్క్'ను ఆవిష్కరించింది. అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగి వచ్చి, సురక్షితంగా అత్యంత విలువైన వస్తువులను చేర్చగల సామర్థ్యం దీని సొంతం.

New Update
space delivery vehicle Ark

అంతరిక్ష సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాస్ ఏంజిల్స్(los-angeles) కేంద్రంగా పనిచేస్తున్న ఏరోస్పేస్ కంపెనీ 'ఇన్వర్షన్' ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ డెలివరీ వాహనం(world first space delivery vehicle) 'ఆర్క్'(vehicle Ark)ను ఆవిష్కరించింది. అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగి వచ్చి, సురక్షితంగా అత్యంత విలువైన వస్తువులను చేర్చగల సామర్థ్యం దీని సొంతం. 'ఆర్క్' వాహనం ముఖ్యంగా జాతీయ భద్రత, రక్షణ రంగ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. యుద్ధంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పరికరాలు, మిషన్-క్రిటికల్ కార్గోను సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరవేయడం దీని ప్రధాన ఉద్దేశం. భూమిపై ఉన్న ఎలాంటి లక్ష్యాన్ని అయినా తక్కువ టైంలో చేరుకోవడానికి వీలుగా ఈ వాహనం కింది-భూ కక్ష్య లో తిరుగుతోంది. డిమాండ్‌ను బట్టి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది.

Also Read :  రయ్ రయ్.. టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 242 భారీ మైలేజ్..!

Los Angeles Based Company Inversion

'ఆర్క్' ప్రత్యేకత ఏంటంటే, ఇది భూవాతావరణంలోకి అత్యంత వేగంగా తిరిగి ప్రవేశించి, గంటకు 20 మాక్ వేగాన్ని తట్టుకోగలదు. గాలిలో తన డైరెక్షన్లు మార్చుకుంటూ పారాచూట్ల సహాయంతో సురక్షితంగా, నిర్దిష్ట ప్రదేశంలో దిగుతుంది. ఈ సామర్థ్యం వల్ల దీన్ని హైపర్‌సోనిక్ టెస్టింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. అమెరికా జాతీయ భద్రతలో హైపర్‌సోనిక్ టెస్టింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, 'ఆర్క్' ఒక కీలకమైన వనరుగా మారనుంది.

Also Read :  ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. ఐఫోన్, శామ్‌సంగ్, గూగుల్ ఫోన్లపై వేలకు వేల డిస్కౌంట్‌లు!

ఈ వాహనాన్ని 2026 నాటికి తొలి మిషన్‌కు సిద్ధం చేయాలని 'ఇన్వర్షన్' లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ తమ సొంత 'రే' అనే తొలి అంతరిక్ష నౌక సాంకేతికతపై ఆధారపడింది. భవిష్యత్తులో, 'ఆర్క్' వంటి వేలాది వాహనాలతో కూడిన ఓ అంతరిక్ష లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను రూపొందించడం కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యం. ఈ నెట్‌వర్క్ భవిష్యత్తులో వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని 'ఇన్వర్షన్' సహ-వ్యవస్థాపకుడు జస్టిన్ ఫియాస్చెట్టి తెలిపారు. ఈ ఆవిష్కరణ అంతరిక్ష డెలివరీ రంగంలో కొత్త శకానికి నాంది పలికినట్టే. 

Advertisment
తాజా కథనాలు