Pak Occupied Kashmir: POKతో డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్.. రాత్రికి రాత్రే వాళ్లతో సంతకాలు!

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. నిరసనకారుల ప్రతినిధి బృందం, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC)తో శనివారం రాత్రి ఓ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది.

New Update
POK deal

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌(pak occupied kashmir) లో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలకు పాకిస్తాన్ ప్రభుత్వం(protest in pok) ఎట్టకేలకు తలొగ్గింది. నిరసనకారుల ప్రతినిధి బృందం, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC)తో శనివారం రాత్రి ఓ కీలక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా ప్రాంతంలో శాంతిని పునరుద్ధరిస్తున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి ఈ ఒప్పందాన్ని శాంతికి విజయంగా పేర్కొన్నారు.

పీఓకేలో రాజకీయ, ఆర్థిక అణచివేతకు వ్యతిరేకంగా, సబ్సిడీ గోధుమ పిండి, విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి 38 డిమాండ్లతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. సెప్టెంబర్ 29న చర్చలు విఫలమైన తర్వాత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు పోలీసులు సహా కనీసం 12 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో పీఓకేలోని ముజఫరాబాద్, రావాలాకోట్ వంటి ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. పరిస్థితి విషమించడంతో, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల కోసం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని ముజఫరాబాద్‌కు పంపారు. సుదీర్ఘ చర్చల తర్వాత నిరసనకారుల 38 డిమాండ్లలో 25 అంశాలకు ఆమోదం తెలుపుతూ తుది ఒప్పందం కుదిరింది.

Also Read :  ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్

ఒప్పందంలో కీలక అంశాలు:

నిరసనల్లో మరణించిన వారికి పరిహారం చెల్లింపు.
హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు, నిరసనకారుల మరణాలపై ఉగ్రవాద కేసులు నమోదు.
పీఓకేలో విద్యుత్ వ్యవస్థ మెరుగుదల కోసం పాక్ రూ. 10 బిలియన్ల నిధులను కేంద్రం అందిస్తుంది.
ముజఫరాబాద్, పూంచ్ డివిజన్ల కోసం రెండు అదనపు ఇంటర్మీడియట్, సెకండరీ విద్యా బోర్డుల ఏర్పాటు.
నిఘా, అమలు కమిటీని ఏర్పాటు చేయడం.
మీర్‌పూర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు.
ఈ ఒప్పందం తర్వాత, నిరసనకారులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. మూసివేసిన రహదారులు తిరిగి తెరచుకున్నాయని మంత్రి ప్రకటించారు. ఈ ఒప్పందం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం లొంగిపోయిందనడానికి నిదర్శనంగా అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది.

Also Read :  బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకారం.. హమాస్ ముందుకొస్తే కాల్పుల విరమణ!

Advertisment
తాజా కథనాలు