/rtv/media/media_files/2025/10/05/russia-2025-10-05-14-32-33.jpg)
'No Such Cooperation With Pakistan', Russia Denies Plans To Supply Fighter Jet Engines
భారత్ మిత్ర దేశమైన రష్యా పాకిస్థాన్‌కు సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల కోసం రష్యా తమ ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో తాజాగా రష్యా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. పాకిస్థాన్‌తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశాయి. భారత్‌తో తాము వాణిజ్య సంబంధాలను ఎక్కువగా కొనసాగిస్తున్న క్రమంలో పాకిస్థాన్‌కు మేము సాయం చేస్తున్నట్లు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని హెచ్చరించాయి.
Also Read: పక్కా ప్లాన్ తోనే కరూర్ తొక్కిసలాట.. విజయ్ ర్యాలీపై ఖుష్బూ సంచలన ఆరోపణలు!
భారత్‌ను ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలు కూడా తాము తీసుకోమని తేల్చిచెప్పాయి. పాకిస్థాన్‌లో ప్రస్తుతం చైనా తయారీ JF17 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అయితే వీటి కోసం వాడే ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. రష్యా మనకు అత్యంత సన్నిహిత దేశమని ప్రధాని మోదీ అంటారని.. కానీ రష్యా మాత్రం మన శత్రు దేశమైన పాక్‌కు సాయం చేస్తోందని ఆరోపించింది. ఇది ప్రధాని మోదీ ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకునే విషయంలో వైఫల్యాన్ని సూచిస్తోందని సెటైర్లు వేసింది.
Also Read: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్‌లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్
ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల కన్నా తనకు పేరు వచ్చే వాటి కోసమే ప్రాధాన్యం చూపిస్తారంటూ విమర్శించింది. పాకిస్థాన్‌కు రష్యా ఎందుకు సాయం చేస్తుందో మోదీ సర్కార్ వివరించాలంటూ డిమాండ్ చేసింది. దౌత్య విషయంలో పాకిస్థాన్‌ను ఇప్పటికీ కూడా ఒంటరి చేయలేకపోతున్నారని దుయ్యబట్టింది. ఈ క్రమంలోనే దీనిపై రష్యా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. తాము పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చాయి. అయితే రష్యా ప్రభుత్వం దీనిపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు.
Also Read: POKతో డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్.. రాత్రికి రాత్రే వాళ్లతో సంతకాలు!