Israel-Gaza: బలగాల ఉపసంహరణకు ఇజ్రాయిల్ అంగీకారం.. హమాస్ ముందుకొస్తే కాల్పుల విరమణ!

ఇజ్రాయెల్-గాజా యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. హమాస్‌ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు.

New Update
Israel

ఇజ్రాయెల్-గాజా యుద్ధం(israel gaza war) ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ప్రణాళికలోని తొలిదశలో భాగంగా గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని వెల్లడించారు. గాజా శాంతి ఒప్పంద ప్రణాళికలో ఇది ఫస్ట్ ఫేజ్.

Also Read :  Los Angeles: పార్సల్ డెలివరీల్లో కొత్త ట్రెండ్.. నేరుగా ఆకాశం నుంచే అందుకోవచ్చు!

Israel Withdraw Forces From Gaza

దీన్ని హమాస్‌ కు కూడా పంపించినట్లు వెల్లడించారు. హమాస్‌ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు. దీంతో ఇజ్రాయెల్‌-హమాస్‌(hamas-israel) మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు. బందీల అప్పగింత తర్వాత బలగాలు ఉపసంహరణకు నిబంధనలు రూపొందిస్తామన్నారు. అయితే, దీనికి సంబంధించి ఇజ్రాయెల్‌ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇక, అమెరికా ప్రణాళికలకు సంబంధించి ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య సొమవారం ఈజిప్టులో పరోక్ష చర్చలు జరగనున్నాయి. 

అమెరికా ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో.. బందీల విడుదల, కాల్పుల విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణతో పాటు హమాస్ నిరాయుధీకరణ వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ సైద్ధాంతికంగా అంగీకరించినట్లు ట్రంప్ పదేపదే చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం గాజా నుంచి పూర్తి ఉపసంహరణ ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి హమాస్ వైపే ఉంది.

Also Read :  Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగో పరుగు

Advertisment
తాజా కథనాలు