Pakistan Border: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించడానికి.. ఇండియా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు

దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది.

New Update
AK-630 30mm

దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ(Indian Army) కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'(Mission Sudarshan Chakra) లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్ అండ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ 30mm మల్టీ-బారెల్ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ గన్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని సైన్యం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన 'మిషన్ సుదర్శన్ చక్ర'లో ఇది ఒక ముఖ్యమైన అడుగు. 2035 నాటికి దేశానికి సమగ్రమైన, మల్టీ లేయర్ కవచ్ సృష్టించడమే ఈ మిషన్ లక్ష్యం.

Also Read :  కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. కేజ్రీవాల్ కీలక ప్రకటన!

Indian Army To Procure AK-630 Air Defence Guns

'ఆపరేషన్ సిందూర్' 
గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) సమయంలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలోని పౌరులు, మత సంస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేయడాన్ని సైన్యం గుర్తించింది. దీంతో అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉండే ముఖ్య ప్రాంతాలకు మరింత పటిష్టమైన ఎయిర్ డిఫెర్స్ అవసరమని భావించింది.

Also Read :  ఓర్నీ.. మారిపోయిన మృతదేహాలు, వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేసిన కుటుంబం

AK-630 గన్ ప్రత్యేకతలు:

కొనుగోలు చేయనున్న AK-630 వ్యవస్థ.. మానవరహిత వైమానిక వాహనాలు (UAVలు), రాకెట్లు, ఆర్టిలరీ, మోర్టార్ వంటి ముప్పులను సమర్థవంతంగా అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ గన్ వ్యవస్థను హై మొబిలిటీ వాహనం ద్వారా లాగగలిగే ట్రైలర్‌పై అమరుస్తారు. ఇది 4 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉండి, నిమిషానికి 3,000 రౌండ్ల వరకు ఫైరింగ్ సామర్థ్యం ఉంది. అన్ని రకాల వాతావరణాలలోనూ పనిచేయగల ఎలక్ట్రో-ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా లక్ష్యాలను గుర్తించి, వాటిని చేధించగలదు.

Advertisment
తాజా కథనాలు