🔴Live News Updates: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌గా అమెరికా B-2 బాంబర్లతో తీవ్రంగా దాడులు చేయడం వల్ల ఈ నాశనమయ్యాయని తెలిపారు.
చైనాలో మరో 22 కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 142 గబ్బిలాల మూత్రపిండాలపై పరిశోధనలు చేసి వీటిని గుర్తించారు. గబ్బిలాలు పండ్లు, కూరగాయలను తినడం వల్ల వైరస్ వాటి నుంచి వ్యాప్తి చెందుతుందని, చాలా డేంజర్ అని నిపుణులు అంటున్నారు.
3వేల కార్లతో మెక్సికోకు వెళుతున్న ఓ నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ముందుగా నౌకలో మంటలు చెలరేగాయని, అనంతరం సముద్రంలో మునిగిపోయిందని నౌకాసంస్థ తెలిపింది. నౌకలో ఉన్న 3వేల కార్లలో 800 వరకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.
అమెరికా దాడుల కంటే ముందే ఇరాన్ అణు కేంద్రాలైన నంతాజ్, ఫోర్డో, ఇస్ఫాహాన్ ల నుంచి 400 కేజీల యూరేనియం వేరే చోటుకి తరలించింది. అమెరికా ఎత్తును ఇరాన్ తిప్పి కొట్టింది. ఈ విషయంలో అమెరికా ఓటిపోయింది. ట్రంప్ మోసపోయాడు.
ఆక్సియం -4 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులు యాత్ర కోసం బుధవారం మధ్యహ్నం 12 గంటలకు పాల్కన్ 9 రాకెట్ బయలుదేరింది.
ఇరాన్ నుంచి భారతీయులతో బయల్దేరిన ప్రత్యేక విమానం బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో 282 మంది భారతీయులు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఇరాన్ నుంచి వచ్చిన 11వ విమానం ఇదని విదేశాంగ శాఖ పేర్కొంది.
తెహ్రీక్ -ఎ- తాలిబన్ పాకిస్తాన్ వజీరిస్తాన్లోని మంగళవారం సైన్యంపై దాడులు చేసింది. ఇందులో పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్‌ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ మోయిజ్ అబ్బాస్ మరణించాడు. ఆయనతో తోపాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులను మృతిచెందారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ అధికారికంగా నోబల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. నోబల్ పీస్ ప్రైస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ మంగళవారం నామినేషన్ సమర్పించారు. ట్రంప్ చేసిన పని అసాధారణ, చారిత్రాత్మకమని కొనియాడారు.